ఫ్యామిలీ మ్యాన్‌ 2 తెలుగులో ఎప్పుడో తెలుసా?

నార్త్‌ ఆడియన్స్ తో పాటు తెలుగు ఆడియన్స్‌ అంతా కూడా ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్న ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్ 2 స్ట్రీమింగ్‌ ప్రారంభం అయ్యింది.సమంత నటించడం తో పాటు ఈ వెబ్‌ సిరీస్ కు సౌత్‌ ఆడియన్స్ కు కనెక్షన్ ఉన్న కారణంగా తెలుగు మరియు తమిళంలో కూడా స్ట్రీమింగ్‌ చేసేందుకు చాలా మంది వెయిట్‌ చేస్తున్నారు.

 When The Family Man 2 Telugu Audio Streaming , First Look The Family Man' Season-TeluguStop.com

కాని ఈ వెబ్‌ సిరీస్ ను కేవలం హిందీ లో మాత్రమే స్ట్రీమింగ్‌ చేస్తున్నారు.టెక్నీకిల్‌ ప్రాబ్లం కారణంగా వెబ్‌ సిరీస్ ను సౌత్‌ భాషల్లో స్ట్రీమింగ్‌ చేడయం లేదు అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

కాని తమిళంలో ఉన్న విభేదాల కారణంగానే ఈ వెబ్‌ సిరీస్ ను ఇతర భాషల్లో విడుదల చేయలేదు అనే విషయం అందరికి తెలిసిన రహస్యం.వెబ్‌ సిరీస్‌ సౌత్‌ భాషల స్ట్రీమింగ్‌ కు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే జరిగినా కూడా వివాదం ముదిరే అవకాశం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

కాస్త ఆలస్యం గా అయినా కూడా ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌ సిరీస్‌ సౌత్‌ భాషల్లో స్ట్రీమింగ్‌ అవ్వడం ఖాయం అంటున్నారు.కనుక తెలుగు ఆడియో ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు.

ఎట్టకేలకు తెలుగు ఆడియో స్ట్రీమింగ్‌ కు సంబంధించిన విషయాన్ని గురించి అమెజాన్‌ స్పష్టతను ఇచ్చింది.ఈ వారంలో వెబ్ సిరీస్‌ తెలుగు మరియు తమిళ ఆడియో ఏ క్షణంలో అయినా అందుబాటు లోకి రావచ్చు అంటున్నారు.

సమంత మరియు మనోజ్‌ బాజ్‌ పెయి కీలక పాత్రలో నటించిన ఈ వెబ్‌ సిరీస్ పై అంచనాలు మొదటి నుండి సౌత్‌ అభిమానుల్లో కూడా భారీగా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా వెబ్‌ సిరీస్ ను దర్శక ద్వయం రాజ్ అండ్‌ డీ కే లు తెరకెక్కించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube