కరోనా నియంత్రణలో అల్లోపతి వైద్యం ఏమాత్రం పనిచేయలేఅని యోగా గురు బాబా రాందేవ్ చేసిన కామెంట్స్ కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.ఇదిలాఉంటే బాబా రాందేవ్ పతంజలి ప్రొడక్ట్స్ నుండి కరోనిల్ అనే మందు కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా వ్యాధి నిరోధక శక్తి పెంచేందుకు ఉపయోగపడుతుందని రిలీజ్ చేశారు.
అయితే లేటెస్ట్ గా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏకంగా కరోనా కిట్ తో పాటుగా పతంజలి కరోనిల్ ను కూడా చేర్చి ప్రజలకు అందిస్తుంది.దీనిపై ఐ.ఎం.ఏ ఆగ్రహం వ్యక్తం చేసింది.అల్లోపతి మందులు ఉన్న కరోనా కిట్ లో ఆయుర్వేద మందు అయిన కరోనిల్ చేర్చడాన్ని సీరియస్ గా తీసుకుంది ఐ.ఎం.ఏ.దీనిని మిక్సోపతి అంటారని.
కరోనిల్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించలేదని కేంద్ర మార్గదర్శకాల్లో ఆయుర్వేద ఔషధం చేర్చలేదని ఐ.ఎం.ఏ గుర్తు చేసింది.
అల్లోపతి మందులతో పాటుగా ఆయుర్వేదాన్ని కలపడం కరెక్ట్ కాదని సుప్రీం కోర్ట్ కూడా దీనిపై చురకలు అంటించిందని చెప్పారు.
కరోనా ఔషధంగా తీసుకొచ్చిన కరోనిల్ పై తీవ్ర విమర్శలు రావడంపై పతంజలి వెనక్కి తగ్గింది.ఇమ్యునిటీ బూస్టర్ గా దాన్ని పేర్కొంది.ఉత్తరాఖండ్ తో పాటుగా హర్యానా ప్రభుత్వం కూడా కరోనా కిట్ లో కరోనిల్ చేర్చింది.