ఇంటర్వ్యూలో రతన్ టాటా శునకాన్ని వెంట తెచ్చుకున్నప్పుడు...

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మంచి వ్యక్తి గానే కాకుండా దయాద్ర హృదయునిగానూ పేరు గాంచారు.అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన కథనాలు చూస్తుంటాం.

 When Ratan Tata Brought The Dog Along In The Interview , Ratan Tata , Dog , In-TeluguStop.com

అలాంటి ఒక ఉదంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.హ్యూమన్స్ ఆఫ్ బాంబే వ్యవస్థాపకురాలు మరియు సీఈవో ఒకసారి రతన్ టాటాను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లినప్పుడు ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది.

ఆమె వెళ్లిన సమయంలో రతన్ టాటా కుర్చీలో కూర్చున్నారు.అతని పక్కన ఒక శునకం కూడా ఉంది.

కరిష్మా మెహతా మాట్లాడుతూ ఇది ఒక ప్రత్యేకమైన మరియు మరపురాని ఇంటర్వ్యూ అని పేర్కొన్నారు.ఆమె ఈ ఇంటర్వ్యూ కథనాన్ని ఆయన లింక్డ్‌ఇన్‌లో పంచుకున్నారు.

ఆమె తన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో షేర్ చేశారు.

‘నేను అతని (రతన్ టాటా) ఇంటర్వ్యూ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను.ఈసారి కొంచెం భయం వేసింది.ఇంటర్వ్యూ సమయంలో నేను చాలా భయపడ్డాను.

కాని నేను చెప్పిన విషయాలు చాలా వరకు రతన్ టాటా విన్నారు.అప్పుడు నన్ను అడిగారు ఏమైంది అలా ఉన్నావు? అని అన్నారు.నాకు కుక్కలంటే భయం అని రతన్ టాటాతో చెప్పాను.వెంటనే టాటా తన కుర్చీని కుక్క వైపున తిప్పి.‘గోవా’ (కుక్క పేరు) ఆమెకు భయంగా ఉంది కాబట్టి మంచి అబ్బాయిలా నిశ్శబ్దంగా కూర్చో అని చెప్పారు.ఆ తర్వాత రతన్ టాటా ఇంటర్వ్యూ కొనసాగించాలని కోరారు.

దాదాపు 30 నుంచి 40 నిమిషాల పాటు ఇంటర్వ్యూ సాగింది.అంతసేపటి వరకూ కుక్క నా దగ్గరికి రాలేదు.

నేను ఆశ్చర్యపోయాను.ఎందుకంటే ఎప్పుడూ నా విషయంలో ఇలా జరగలేదు.

గోవా అనే కుక్కను రతన్ టాటా తన దగ్గరే ఉంచుకుంటారని కరిష్మా తెలిపారు.అంతేకాదు ఈ శునకం రతన్ టాటాతో సమావేశానికి కూడా వెళ్తుంటుంది.

ఈ ఉదంతం వైరల్‌గా మారింది.

When Ratan Tata Brought The Dog Along In The Interview , Ratan Tata , Dog , Interview , People , Social Media , Founder Of Humans Of Bombay , LinkedIn - Telugu Founderhumans, Interview, Linkedin, Ratan Tata

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube