సినిమా ఇండస్ట్రీ లో సక్సెస్ ఉంటేనే కెరియర్ అనేది సాఫీగా సాగుతుంది.ఎప్పుడో హిట్ ఇచ్చాం కదా అంటే కుదరదు ఎప్పటికప్పుడు హిట్లు ఇస్తూనే ఉండాలి వాళ్ళు డైరెక్టర్స్ అయిన హీరోలైన ఎవరికైనా ఇక్కడ అదే రూల్ వర్తిస్తుంది.

అయితే డైరెక్టర్స్ మంచి హిట్ సినిమాలు తీసిన తర్వాత పెద్ద హీరోలని అప్రోచ్ అయి కథలు చెప్తారు అప్పుడు ఆ హీరోలకి డైరెక్టర్లు చెప్పిన కథ నచ్చి ఆయన ఈ సబ్జెక్ట్ ని డీల్ చేస్తాడు అనే కాన్ఫిడెంట్ ఉంటేనే పెద్ద హీరోలు డైరెక్టర్స్ కి డేట్స్ ఇస్తారు.అయితే చాలా మంది పెద్ద హీరోలు ఇదే పద్దతి పాటిస్తుంటారు…కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఒక సినిమా ఇచ్చే డైరెక్టర్ కి సంభందించిన వివరాలు ఆయన చేసిన ముందు సినిమాలు ఏంటి ఆయనకి ఇంతకు ముందు హిట్ సినిమాలు ఉన్నాయా లేవా అనే విషయాలను అసలు పట్టించుకోరు వాళ్ళు చెప్పిన కథ బాగుంటే చాలు వాళ్ల మీద నమ్మకాన్ని పెట్టీ వాళ్ళకి సినిమాలు ఇస్తాడు.ఇప్పటివరకు ఆయనతో సినిమా లు చేసిన డైరెక్టర్స్ లిస్ట్ చూస్తే మనకు ఈ విషయం అర్థం అవుతుంది… పూరి జగన్నాథ్, కరుణాకరన్ లాంటి డైరెక్టర్స్ ని సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చేసిన ఘనత కూడా పవన్ కళ్యాణ్ కే దక్కుతుంది.

అలాగే ఆయన చేసిన గోపాల, గోపాల కాటమరాయుడు సినిమాలకి డాలీ డైరెక్టర్ గా వ్యవహరించారు ఇక గత సంవత్సరం రిలీజ్ అయిన బీమ్లా నాయక్ సినిమాకి కూడా సాగర్ కే చంద్ర అనే ఒక చిన్న డైరెక్టర్ ని పెట్టీ పెద్ద సాహసమే చేశాడు…ప్రస్తుతం సుజీత్ తో కూడా ఒక గ్యాంగ్ స్టార్ సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది… అలా ఇండస్ట్రీ లో అందరి హీరోల కంటే పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం చాలా ఈజి ఎందుకంటే డైరెక్టర్ దగ్గర కథ ఉండి ఆయన నిజాయితీ గా సినిమాని తియగలడు అనే నమకాన్ని ఆయనకి కలిగిస్తే చాలు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చేస్తాడు…