సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటుల మధ్య మంచి మంచి సన్నిహితం ఉంటుంది.కేవలం సినిమా షూటింగ్ వరకే కాకుండా బయట కూడాచాలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటారు.
తమ తమ వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ ఉంటారు.అలా వారి మధ్య మంచి స్నేహం కూడా ఏర్పడుతుంది.
ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటుల మధ్య మంచి స్నేహబంధం కొనసాగుతుంది.ఇక అందులో కీర్తి సురేష్, హీరో నాని స్నేహబంధం ఒకటి.
ఇక వీరిద్దరూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నటులుగా పేరు సంపాదించుకున్నారు.ఇద్దరికీ ఇండస్ట్రీలో మంచి అభిమానం ఉంది.ఇక నాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నాని కెరీర్ మొదటి నుంచి ఇప్పటివరకు మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలని ఎంచుకొని తన పాత్రలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.
వ్యక్తిగతంగా కూడా నాని మంచి మనసున్న వ్యక్తి అని చెప్పాలి.ఈయనతో నటించిన నటీనటులు ఈయన గురించి చాలా సందర్భాలలో తెలిపారు.ఇక కీర్తి సురేష్ విషయానికి వస్తే.
అప్పటివరకు చిన్న హీరోయిన్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ.మహానటి సావిత్రి సినిమాలో నటించి స్టార్ హోదాకు చేరుకుంది.
ఇక ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది.
ఈ బ్యూటీ కూడా చాలా న్యాచురల్ గా కనిపిస్తూ ఉంటుంది.అని ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి కూడా తెరవేసింది.కెరీర్ మొదట్లో ఉన్న కీర్తి సురేష్ కు.ఇప్పుడున్న కీర్తి సురేష్ కు చాలా తేడా అని చెప్పాలి.ఇక నాని, సురేష్ ఇద్దరు కలిసి గతంలో నేను లోకల్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.
ఇక ఈ సినిమా సమయంలో వీరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది.ఇక అప్పటి నుంచి వీరిద్దరూ కలిసిన కబుర్లు చెప్పుకుంటూ కనిపిస్తూ ఉంటారు.ఇక ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో దసరా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా వచ్చాయి.అయితే ఈరోజు నాని పుట్టినరోజు సందర్భంగా కీర్తి సురేష్ ఒక వీడియో, కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ నానికి బర్త్ డే విష్ చేసింది.
అయితే ఆ వీడియోలో వారిద్దరూ.దసరా మూవీ సెట్ లో షటిల్ గేమ్ ఆడుతూ ఉండగా ఆ వీడియోను పంచుకుంది.అయితే అందులో కీర్తి సురేష్ నాని పై కాస్త అర్చినట్లు కూడా కనిపించింది.ఇక వెంటనే ఆ వీడియోను నాని తన స్టోరీ రూపంలో పంచుకొని చీటర్ అంటూ.
థాంక్యూ కిట్టి అని తెలిపాడు.అంటే నాని కీర్తి సురేష్ ని ముద్దుగా కిట్టి అని పిలుస్తాడని తెలుస్తుంది.
ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవ్వగా వారి అభిమానులు ఆ వీడియో చూసి తెగ నవ్వుకుంటున్నారు.అంతే కాకుండా వీరి మధ్య అంత క్లోజ్ ఉందా అంటూ ఫిదా అవుతున్నారు.