ఆన్ లైన్ లో అమ్మకానికి ఆ జంతువు వాంతి.. చివరకి..?!

మన పక్కన ఉన్నవాళ్లు ఎవరైనా వాంతులు చేసుకుంటుంటే చూడడానికి మనకి కొంచెం చిరాకుగా అనిపిస్తుంది కదా.అలాంటిది ఆ జంతువు మాత్రం వాంతు చేసుకుంటే దానిని భద్రంగా పట్టుకుని వచ్చి మరి వేలం పాట పెట్టి మరి అమ్ముతారన్న విషయం మీలో చాలా మందికి ఇప్పటికే తెలిసి ఉంటుంది.

 Whale Vomit For Sale In Guntur District, Ambergris , Whale Vomit, Ambergris Sale-TeluguStop.com

ఇంకా చెప్పాలంటే ఈ వాంతు ఖరీదు కోట్లల్లో ఉంటుంది.ఏంటి వాంతుని అంతా డబ్బులు పెట్టి మరి కొంటారా అని షాక్ అవుతున్నారా.? కానీ.ఇది నిజంగానే నిజం.

ఇలా ఆ జంతువు వాంతుని సేకరించి అక్రమంగా అమ్ముతున్న ఒక ముఠాను పోలీసులు అరెస్ట్ కూడా చేసారు.ఇంతకీ ఆ జంతువు ఏంటి అనుకుంటున్నారా.?! అసలు వివరాల్లోకి వెళితే.

ఆ జంతువు మరేంటో కాదు నీటిలో ఉండే తిమింగలం.

తిమింగలం వాంతిని “అంబర్ గ్రీస్” అని పిలుస్తారు.దీనికి మార్కెట్లో మంచి గిరాకీ ఉంది.

సాధారణంగా తిమింగలాల సగటు జీవన కాలం 300 సంవత్సరాలు.అయితే తిమింగలం ఆ జీవిత కాల మధ్య వయస్సులో ఆహారం అరుగక దాని పొట్టలోని వ్యర్ధంగా ఉన్న ఆహారాన్ని వాంతి రూపంలో బయటకు కక్కుతోంది.అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే.అలా తిమింగలం వాంతి చేసుకున్న వ్యర్థ పదార్థం నీళ్ల మీద తేలుతుంది అన్నమాట.అలా సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్లకు తిమింగలం వాంతి కనుక కంట పడితే వాళ్ళ తలరాతలు మారిపోతాయి.అంత విలువైన పదార్ధం అన్నమాట ఇది.అందుకే దీనిని సముద్రంపై తేలియాడే బంగారం లేదా సముద్రలో దాగి ఉన్న నిధి నిక్షేపం అని కూడా పిలుస్తారు.దీని ధర ఒక కిలో కోటి రూపాయల వరకూ ధర పలుకుతుంది.

అసలు తిమింగలం వాంతికి ఎందుకు ఇంత డిమాండ్ అని అనుకుంటున్నారా.? ఎందుకంటే అంబర్ గ్రీస్ ను సౌందర్య క్రీమ్స్, ఖరీదైన పర్ప్యూమ్స్ లో వాడతారు.సువాసన ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండడం కోసం ఈ అంబర్ గ్రీస్ ను పెర్ఫ్యూమ్స్ లో ఉపయోగిస్తారు.అయితే మన భారత్ లో అంబర్ గ్రిస్ క్రయవిక్రయాలపై నిషేధం ఉంది.

వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం దీనిని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.

Telugu Ambergris, Ambergris Sale, Latest, Whale, Whale Vomit, Whalevomit-Latest

అందుకే అక్రమంగా అంబర్ గ్రీస్ అమ్మకానికి కొంతమంది ముఠా సభ్యులు ప్రయత్నం చేసారు.కానీ, వాళ్ళ ప్రయత్నాన్ని పోలీసులు చాకిచక్యంగా తిప్పి కొట్టారు.ఆ ముఠా సభ్యుల కదలికలపై నిఘా పెట్టిన చెన్నై వన్య ప్రాణుల నేర నియంత్రణ విభాగానికి చెందిన అధికారులు వ్యాపారుల పేరిట వాళ్ళని సంప్రదించారు.

తాము అంబర్ గ్రీస్ కొంటామని ఆ ముఠా సభ్యులతో బేరం కుదుర్చుకున్నారు.వచ్చిన వాళ్ళు అధికారులు అని తెలియక నిజంగానే అంబర్ గ్రీస్ అమ్మకానికి పెట్టారు.ఈ క్రమంలోనే నరసరావుపేటలోని పువ్వాడ హాస్పిటల్ వద్ద ముఠా సభ్యులను అటవీ అధికారులు పట్టుకున్నారు.వాళ్ళ దగ్గర నుండి 8కిలోల అంబర్ గ్రీస్ స్వాధీనం చేసుకున్నారు.దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ.12కోట్లు వుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.పట్టుబడిన ముఠా సభ్యులను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు.కేసు పరిశీలించిన పిదప వాళ్ళకి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube