ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.రష్యా అధ్యక్షుడు పుతిన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
పుతిన్ బతికున్నాడో లేదో అనుమానమేనని అన్నారు.దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మాట్లాడుతుండగా మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేయడం జరిగింది.
ఈ క్రమంలో రష్యాతో శాంతి చర్చలు ఎప్పుడు ప్రారంభం అవుతాయని ప్రశ్నించారు.దానికి జెలెన్ స్కీ. స్పందించి ఈ విషయంలో ఎవరితో ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని జవాబు ఇచ్చారు.అసలు రష్యా అధ్యక్షుడు బతికున్నాడో లేదో తనకైతే అనుమానమేనని అన్నారు.
అప్పుడప్పుడు టీవీలో కనిపిస్తున్నాడు.మరి ఆయన బతికి నిర్ణయాలు తీసుకుంటున్నడో.లేదా అనేది సందేహంగా ఉందని అన్నారు.
జెలెన్ స్కీ ఈ వ్యాఖ్యలు చేసిన అనంతరం రష్యా అధ్యక్ష కార్యాలయం కొద్ది గంటల్లోనే స్పందించింది.రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంకా రష్యా ప్రపంచంలో దేశంగా కొనసాగటం…జెలెన్ స్కీకి ఇష్టం లేదన్నట్టుగా ఉందని ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది.రష్యాకి ఏమీ కాదు, రష్యా ఇకముందు కూడా ఉంటుంది.
త్వరలోనే జెలెన్ స్కీకి కూడా అర్థమవుతుందని ప్రకటన విడుదల చేయడం జరిగింది.