యువ హీరో విశ్వక్ సేన్( Viswak sen ) ప్రస్తుతం సూపర్ ఫాం లో సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నాడు.కృష్ణ చైతన్య( Krishna Chaitanya ) డైరెక్షన్ లో పీరియాడికల్ మూవీ చేస్తున్న విశ్వక్ సేన్ ఆ సినిమాతో తన రేంజ్ పెంచుకోవాలని చూస్తున్నాడు.
సితార, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.రీసెంట్ గా ఈ సినిమా నుంచి విశ్వక్ సేన్ ఫస్ట్ లుక్ కూడా ఆడియన్స్ ని మెప్పించింది.
ఈ సినిమా తో పాటుగా విశ్వక్ సేన్ ఆహా కోసం ఒక షో చేస్తున్నాడని తెలుస్తుంది.ఫికషనల్ కాన్సెప్ట్ తో ఆహా సరికొత్త షో 15 ఎపిసోడ్స్ తో ప్లాన్ చేస్తున్నారట.ఈ షో విషయంలో ఆహా( Aha ) టీం ఎంతో కాన్ ఫిడెంట్ గా ఉంది.అయితే ఈ షోకి విశ్వక్ సేన్ రెమ్యునరేషన్ అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది.
మొత్తం ప్యాకేజ్ లా ఈ షో కోసం విశ్వక్ సేన్ ని ఫిక్స్ చేశారు ఆహా టీం.ఒక్కో ఎపిసోడ్ కి 10 నుంచి 15 లక్షల చొప్పున కోటిన్నర నుంచి 2 కోట్ల డీల్ తో విశ్వక్ ని ఒప్పించారని తెలుస్తుంది.మొత్తానికి సినిమాలతో పాటు విశ్వక్ ఇలా కూడా భారీగానే సంపాదించేస్తున్నాడు.