ఒక్క ఎపిసోడ్ కి అంత రెమ్యునరేషనా..?

యువ హీరో విశ్వక్ సేన్( Viswak Sen ) ప్రస్తుతం సూపర్ ఫాం లో సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నాడు.

కృష్ణ చైతన్య( Krishna Chaitanya ) డైరెక్షన్ లో పీరియాడికల్ మూవీ చేస్తున్న విశ్వక్ సేన్ ఆ సినిమాతో తన రేంజ్ పెంచుకోవాలని చూస్తున్నాడు.

సితార, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

రీసెంట్ గా ఈ సినిమా నుంచి విశ్వక్ సేన్ ఫస్ట్ లుక్ కూడా ఆడియన్స్ ని మెప్పించింది.

"""/" / ఈ సినిమా తో పాటుగా విశ్వక్ సేన్ ఆహా కోసం ఒక షో చేస్తున్నాడని తెలుస్తుంది.

ఫికషనల్ కాన్సెప్ట్ తో ఆహా సరికొత్త షో 15 ఎపిసోడ్స్ తో ప్లాన్ చేస్తున్నారట.

ఈ షో విషయంలో ఆహా( Aha ) టీం ఎంతో కాన్ ఫిడెంట్ గా ఉంది.

అయితే ఈ షోకి విశ్వక్ సేన్ రెమ్యునరేషన్ అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది.

మొత్తం ప్యాకేజ్ లా ఈ షో కోసం విశ్వక్ సేన్ ని ఫిక్స్ చేశారు ఆహా టీం.

ఒక్కో ఎపిసోడ్ కి 10 నుంచి 15 లక్షల చొప్పున కోటిన్నర నుంచి 2 కోట్ల డీల్ తో విశ్వక్ ని ఒప్పించారని తెలుస్తుంది.

మొత్తానికి సినిమాలతో పాటు విశ్వక్ ఇలా కూడా భారీగానే సంపాదించేస్తున్నాడు.