బేసిగ్గా మన ఇళ్లల్లో కుక్కల్ని పెచుకోవడం చూస్తుంటాం.అదే విదేశాల్లో అయితే ముఖ్యంగా అమెరికా గురించి మాట్లాడుకుంటే, అక్కడ కుక్కలతో పాటు రకరకాల జంతువుల్ని పెంచుకుంటూ వుంటారు.
పిల్లుల్ని, ఎలుకల్ని, పులుల్ని, పందుల్ని కూడా వారు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వుంటారు.సరిగ్గా ఇక్కడ కూడా అదే జరిగింది.
ఫ్లోరిడాలో ఒక జంట పందిని తమ ఇంట్లో పెంచుకుంటున్నారు.దాన్ని ముద్దుగా వారు పింకి అని పిలుచుకుంటున్నారు.
పింకిని ఓ పండిలా కాకుండా తమ ఇంట్లో ఒక సభ్యుడిగా వారు చూసుకుంటారు.దాని కోసం ప్రత్యేక మైన ఫుడ్ తీసుకుంటారు.
అది చూడటానికి తెల్లగా ఉంటుంది.అది ఎప్పుడు చూసినా తమ యజమాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.
వారు బెడ్ రూమ్ కి వెళ్లిన, బాత్ రూమ్ కి పోయిన, బయటకు వెళ్లిన వారినే ఫాలో అవుతుంటుంది.ఈ క్రమంలో ఒక రోజు పింకి ఒక కొంటె పని చేస్తూ వారికి దొరికిపోయింది.
ప్రస్తుతం దానికి సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారడం విశేషం.ఇక పూర్తి వివరాలు చూసుకుంటే, ఫ్లోరిడాలోని న్యూ స్మిర్నా బీచ్ లోని ఒక జంట పందిని పెంచుకుంటున్నారు.
అది ఆడపంది.దాన్ని ముద్దుగా వారు పింకి అని పిలుచుకుంటారు.
ఒక రోజు ఆ పంది.తమ యజమాని బెడ్ రూమ్ లో దూరి, తమ యజమాని దాచుకున్న ఆహారాన్ని కాజేయాలనుకుంది.పాపం.దానికి ఆకలేసిందో.
మరేంటో కానీ.వెంటనే ఒక ప్లాన్ వేసింది.
మెల్లగా ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్లి, తన మూతితో మెల్లగా ఫ్రిడ్జ్ తలుపు తీసింది.అయితే, ఈ తతంగాన్ని ఆ పక్కనుండి చూస్తున్న జంట.పింకి., ఏం చేస్తున్నావంటూ.
మెల్లగా పిలిచారు.దానికి పింకి నేనేమి చెయ్యట్లేదు నాకేమి తెలియదు అన్నట్టు మెల్లగా అటూ ఇటూ తన తలను ఊపుకుంటు చూసింది.
ఆ తర్వాత.మెల్లగా అక్కడి నుంచి జారుకుంటుంది.
ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.