సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు నమ్రత సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా కన్ఫామ్ అయినట్లే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా రెండవ సింగిల్ కోసం సితార లిరికల్ వీడియో లో సందడి చేసిన విషయం తెలిసిందే పెన్ని అంటూ వచ్చిన సాంగులో సితార చేసిన డాన్స్ మరియు ఆమె అప్పియరెన్స్ అభిమానులకు బాగా నచ్చింది.
అంతే కాకుండా ఆమె కు వరుసగా సినిమా ఆఫర్లను కూడా తెచ్చి పెడుతున్నట్లుగా సమాచారం అందుతోంది.నటన పై ఆసక్తి తో సితార ఉంది కనుక ఆమె కు వచ్చిన ఆఫర్ల ను సద్వినియోగం చేసుకునే విధంగా మహేష్ బాబు మరియు నమ్రత ప్రోత్సహిస్తున్నట్లు గా తెలుస్తోంది.
ఇప్పటికే సితార యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మందిని ఎంటర్టైన్ చేస్తున్న విషయం తెలిసిందే.మరో వైపు సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ ఎంతో మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది.ఈ సమయంలో సితార సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడం ద్వారా కచ్చితంగా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంటుంది వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సినిమా కు సంబంధించిన చర్చలు జరుగుతున్న నేపథ్యం లో ఒకటి రెండు రోజుల్లో లేదా కొన్ని నెలల్లో సితార మొదటి సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఈ సమయంలో సితార ఇలా ఎల్లో డ్రెస్ లో కనిపించి అందరి దృష్టి ని ఆకర్షిస్తోంది.మోడ్రన్ డ్రెస్సు లో సితార అలా కనిపిస్తూ వుంటే చూస్తూనే ఉండాలని అనిపిస్తుందని మహేష్ బాబు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నిన్నమొన్నటి వరకు చిన్న పాప గా ఉన్న సితార ఇప్పుడు ఇంత పెద్ద అయిపోయిందా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.