కొంతమంది తమ జీవితంలో ఎంత కష్టపడుతున్నా తగినంత లభించదు.దీంతో డబ్బు విషయంలో ఆందోళన చెందుతుంటాడు.
ఇటువంటి సమస్య నుంచి బయటపడాలంటే, ఈ పది అమూల్యమైన సూత్రాలను అనుసరించాలి.తద్వారా మీ ఇంట్లో డబ్బుకు లోటు ఏర్పడదు.దీనితోపాటు మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం తలెత్తదు.
1. పరమశివుడిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా వ్యక్తి ఆర్థిక అవరోధాలను అధిగమిస్తాడు.దీనికోసం ప్రతిరోజూ శివలింగానికి జలాభిషేకం చేసి, బెల్లం, అక్షతలు, పాలు సమర్పించండి.
2.ప్రతిరోజూ మహాలక్ష్మిని, శ్రీవిష్ణువును పూజించడం వల్ల దుఃఖం, దారిద్ర్యం తొలగిపోతాయి.గురువారం ఉపవాసం ఉండంటం మంచిదని చెబుతారు.

3.ప్రతిరోజూ సాయంత్రం ఆలయంలో దీపదానం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.ఇంటి చుట్టుపక్కల సమీపంలోని ఏదైనా దేవాలయంలో దీపదానం చేసే ప్రయత్నం చేయండి.
4.చంద్రుడిని కూడా పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, చల్లదనం నెలకొంటాయి.దీని కారణంగా ఇంట్లో సంపద వైభవం వెల్లివిరుస్తుంది.పౌర్ణమి రోజున చంద్రుడిని పూజించడం వల్ల ఇంటికి ఐశ్వర్యం చేకూరుతుంది.
5.శ్రీసూక్త పారాయణం వలన గృహంలోని ఆర్థికపరమైన ఆటంకాలు తొలగిపోతాయి.రోజూ శ్రీ సూక్త పారాయణం చేస్తూవుంటూ లక్ష్మిదేవి ఇంట్లో ఉంటుంది.
6.లక్ష్మీసూక్తాన్ని పఠించడం వల్ల కూడా ఇంట్లో లక్ష్మి తాండవిస్తుంది.ఇంటిలోని దారిద్ర్ర్యం తొలగిపోతుంది.
ఇంట్లో కనకవర్షం కురుస్తుంది.

7. కనకధార స్తోత్రం పఠిస్తే ఇంట్లో బంగారు వర్షం కురుస్తుంది.ఇంట్లో ఆనందం, సంపద వెల్లవిరుస్తాయి.ఇంటికి బంగారం, వెండి వచ్చిచేరుతాయి.
8.మంచి ప్రవర్తన కలిగి ఉండాలి.చెడు ప్రవర్తనను నివారించండి.
ఏ వ్యక్తికి హాని చేయవద్దు.మీ మనస్సులో ఎలాంటి దురాశను తీసుకురావద్దు.చెడు ధోరణులను నివారించండి.
9.మనస్సును పవిత్రంగా, సాత్వికంగా ఉంచుకోండి, ఎల్లప్పుడూ ధర్మ కార్యాలు చేయండి.మతపరమైన ప్రవర్తనను కలిగివుండండి
10.
ఇంట్లో శుభ్రత పాటించండి.అప్పుడు డబ్బు మీ ఇంట్లో శాశ్వతంగా ఉంటుంది.
అలాగే ధన నష్టం ఏర్పడదు.దీని వల్ల మీ సంపద చెక్కుచెదరకుండా నిలిచి ఉంటుంది.







