వైరల్ వీడియో: తన పుట్టిన రోజుకి కీబోర్డు ప్లే చేసిన ఖడ్గమృగం..!

పుట్టిన రోజు అంటే ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనదే.మన కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా ఎవరైనా మనం అభిమానించే వారి పుట్టిన రోజులు వస్తే మనం వారి జన్మదినాన్ని సెలెబ్రేట్ చేస్తుంటాం.

 Viral Video A Rhinoceros Played Keyboard On Its Birthday , Rhino Birthday, Celeb-TeluguStop.com

పార్టీలు, సర్ ప్రైజ్ కూడా ప్లాన్ చేస్తాం.కొంతమంది కుటుంబ సభ్యులతో, మరికొంత మంది ఫ్రెండ్స్ తో, ఇంకొంత మంది తమ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ తో జన్మదిన వేడుకలు జరువుకుంటారు.

ఇక సినీ హీరోల ఫ్యాన్స్, రాజకీయ ప్రముఖుల అభిమానులైతే వారి హీరోలు లేదా అభిమాన నాయకుల పుట్టినరోజున బ్యానర్లు కడతారు.సేవా కార్యక్రమాలు చేస్తారు.

సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తూ ఉంటారు.ఇక కొంతమంది జంతు ప్రేమికులు తమ పెంపుడు జంతువులు పుట్టిన రోజులను కూడా సెలెబ్రేట్ చేస్తుంటారు.

ఆ జంతువులకు ఇష్టమైన ఆహారాన్ని పెడ్తారు.కాసేపు అలా బయటకు తీసుకెళతారు.

ఇక ప్రేమికులు అయితే విలువైన బహుమతులు ఇచ్చుకుంటారు.అయితే తాజాగా ఓ జూలోని ఖడ్గమృగానికి తన కేర్ టేకర్ పుట్టిన రోజు వేడుకలు జరిపాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

యూఎస్ లోని కొలరాడో సిటీ పార్క్ లో ఒక ఖడ్గమృగానికి దాని కేర్ టేకర్ పుట్టినరోజు వేడుకలు చేశాడు.

వేడుకలు అంటే దానికి ఇష్టమైన ఆహారం పెట్టి వదిలేయడం కాదు.ఆ ఖడ్గమృగంతో కీబోర్డ్ ప్లే చేయించాడు.ఈ ఖడ్గమృగం పేరు బంధు.అది పుట్టి 12 సంవత్సరాలు అవుతోంది.

దాని పుట్టినరోజు సందర్భంగా ఆ జంతు ప్రదర్శన శాలలోని కేర్ టేకర్ జన్మదిన వేడుకలు నిర్వహించాడు.ఆ వేడుకల్లో ఈ బంధు అనే పేరు గల ఖడ్గమృగం కీ బోర్డు వాయించింది.

ఈ వీడియోను డెన్వర్ జూ అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేయగా.ఈ వీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసేటప్పుడు డెన్వర్ జూ ఏం చెప్పాడంటే.నేను పనిచేస్తున్న జంతు ప్రదర్శన శాలలో ఓ ఖడ్గమృగం ఉంది.దాని పేరు బంధు.ఈ పురుష ఖడ్గమృగానికి నేటితో పన్నెండేళ్ల వయసు వచ్చింది.

తన జన్మదిన సందర్భంగా ఈ రోజు మా బంధు మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తాడు.తానే స్వయంగా ఒక సాంగ్ ను కీ బోర్డు పై ప్లే చేసి వినిపిస్తాడు.

మీరు మా జూ కు వచ్చినప్పుడు టయోటా ఎలిఫెంట్ పాసేజ్ లో ఉండే మా బంధును కలిశాకే ఇంటికి వెళ్ళండి అని పేర్కొన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube