వైరల్: పెళ్లి కొడుకు అవస్థలు చూసి నవ్వు ఆపుకోలేకపోయిన నవ వధువు!

పెళ్లిళ్ల సీజన్ కావడంతో దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కల్యాణ మండపాలు అలంకరించిన కొత్త పెళ్లి కూతురిలా ముస్తాబైపోతున్నాయి.నేడు వెడ్డింగ్ అనేది చాలా హాట్టహాసంగా జరుపుకుంటున్నారు.

 Viral: The New Bride Couldn't Stop Laughing At The Condition Of Her Husband ,gro-TeluguStop.com

పెళ్లికి ముందు, తరువాత కూడా రకరకాల ఫోటో షూట్స్ అంటూ నవ దంపతులు( Newlyweds ) తెగ ఎంజాయ్ చేస్తున్నారు.ఈ క్రమంలో అనేక జ్ఞాపకాలను కెమెరాలలో బంధిస్తున్నారు.

సంప్రదాయాలు ఏవైనా.ప్రతి జంట తమ పెళ్లిని చాలా ప్రత్యేకంగా, జీవితాంతం గుర్తిండేలా చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.

ఈ క్రమంలో చాలా పెళ్లిళ్లు తాలూక ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం మనం ప్రతిరోజూ చూస్తూనే ఉంటాం.తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.బరాత్, సంగీత్, హల్దీ ఫంక్షన్, మెహందీ, పెళ్లి వేదిక వద్దకు వధువు, వరుడి ఎంట్రీ సహా ప్రతీ ఘట్టాన్ని వీడియోలో చిత్రీకరిస్తూ, అందులోని ఆసక్తికర సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వున్నారు.

ఇక వైరల్ అవుతున్న తాజా వీడియోలో వరుడి అవస్థలు( groom ) చూసి నవ వధువు( bride ) తెగ నవ్వుకుంటోంది.విషయం ఏమంటే, ఓ జంట రిసెప్షన్ వేడుక జరుగుతోంది.వేదికపై అందరూ చూస్తుండగానే వరుడు, వధువుకి ప్రపోజ్ చేయాలని కెమెరా మేన్ ఆదేశించాడు.

ఆలా చేస్తే మంచి ఫోటో తీస్తానని చెప్పాడు.కట్ చేస్తే ఆ పెళ్లి కొడుక్కి అలా ప్రపోజ్ చేయడం చేతకావడం లేదు.

ఎందుకంటే అతను మోకాలిమీద కూర్చొని ప్రపోజ్ చేయడం రావడంలేదు.దాంతో లాభంలేక ఫోటోగ్రాఫర్ వచ్చి.

అలా కాదు ఇలా ప్రపోజ్ చేయండి అంటూ కాస్త ట్రైనింగ్ ఇచ్చాడు.తరువాత కూడా మనోడికి చేతకాలేదు.

కాగా పెళ్లి కొడుకు ప్రయత్నాలను చూసి ఆ పెళ్లి కూతురు నవ్వు ఆపుకోలేకపోయింది.చేతిని అడ్డుపెట్టుకుని మరీ ముసి ముసి నవ్వులు నవ్వింది.

కాగా ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube