వైరల్: 'జారు మిఠాయా' పాట పాడుతూ తంతానంటోన్న చిన్నారి... ఫన్నీ వీడియో!

‘జంబలకడి జారుమిఠాయ’ పాట వినగానే మంచువారి సినిమా వేదిక అందరికీ గుర్తు వస్తుంది.ఎందుకంటే బేసిగ్గా ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన ఈ పాటని వెలికి తీసిన క్రెడిట్ మంచు మోహన్ బాబుకే వర్తిస్తుంది.

 Viral: Little Girl Singing 'jaru Mithaya' Song... Funny Video ,girl, Viral Lates-TeluguStop.com

కొన్ని నెలల క్రితం ఆమె సొంత బేనర్లో వచ్చిన సినిమా ఫంక్షన్లో భాగంగా ఓ మహిళ పాడిన పాటే ఈ ‘జంబలకడి జారుమిఠాయ.’ ఇక ఈ పాట ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా మీకు వివరించి చెప్పనక్కర్లేదు.

చిన్న పిల్లలు మొదలు.పెద్దల వరకు అందరూ ఈ పాటకు పేరడీలు, సెటైర్లు, మీమ్స్ ఒకటేంటి.

సోషల్ మీడియా అంతా ఈ పాటతో నేడు మోత మోగిపోతోంది అంటే మీరు నమ్మితీరాలి.

ఈ క్రమంలో తాజాగా ఓ చిన్నారికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అవును, ఆ చిన్నారి ఆ అక్ వాడుకున్న తీరు చూస్తే చాలా ముచ్చటేస్తుంది.ఆ వీడియోలో చిన్నారి పాట పాడుతూనే స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం మనం గమనించవచ్చు.

బేసిగ్గా పిల్లలు చదువంటే అంతగా ఆసక్తి చూపరు.వైరల్ అవుతున్న వీడియోలోని చిన్నారి కూడా అదే కోవకు చెందినట్లుంది.

జంబలకిడి జారుమిఠాయ పాటను కాస్త మార్చి… ‘నేను చదివేస్తను చూడు.నేను చదివేస్తను చూడు.

నాకు మార్కులు గానీ రాకపోతే నిన్ను కొట్టేస్తను చూడు జంబలకడి జారు మిఠాయా?’ అంటూ పాడటం మనం చూడవచ్చు.

కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లకు ఓ సందేహం వచ్చింది.అంతా బాగానే వుంది కానీ పాట చివరలో కొట్టేస్తా అని ఎవరినందో అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.కొంతమంది ఆ వార్నింగ్ స్కూల్ టీచర్‌కే అని కామెంట్స్ పెట్టగా….

మరికొంతమంది మాత్రం తన అమ్మ నాన్నలకే సీరియస్ వార్నింగ్ ఇస్తోంది అంటూ కామెంట్స్ చేయడం ఇక్కడ మనం చదవచ్చు.ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రమ్‌లో harshitha_dolly పేరుతో ఉన్న అకౌంట్‌లో పోస్ట్ చేయగా.

అదికాస్తా వైరల్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube