వైరల్: అక్కడ అన్ని కార్యక్రమాలలో ఆడవాళ్లే..!

ప్రస్తుతం ఆడవాళ్లు అన్ని రంగాలలోను రాణిస్తున్నారు.కానీ ఎక్కడో ఒకచోట ఇంకా పురుషాధిక్యత కనిపిస్తూనే వస్తుంది.

 Viral From Marriages To Death Rituals All Works Are Done By Women In Russias Est-TeluguStop.com

అయితే ఒకప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ అనేది ఉండేది కానీ కాలక్రమేణా దానిని పితృస్వామ్య రాజ్యంగా చేసేసారు.అందుకే పురుషులదే పై చేయిగా నిలుస్తుంది.

అయితే మన హిందూ దర్మ ప్రకారం చనిపోయిన వారికి మగవారితోనే కర్మకాండలు చేపిస్తూ వస్తున్నారు.కానీ ఆ ప్రాంతంలో మాత్రం అన్నీ మహిళలే చేస్తారు తెలుసా.

పెళ్లిళ్ల దగ్గర నుండి కర్మకాండలు వరకు అన్నీ కూడా ఆ ప్రాంతంలో మహిళలే నిర్వహిస్తారట ఏంటి ఆశ్చర్యంగా ఉంది కదా.! మరి ఆ ప్రాంతం ఎక్కడ ఉందో ఏంటో అనే వివరాలు చూద్దామా.!

యూరప్ లోని ఎస్తోనియా అనే దేశం.ఆ దేశంలో దాదాపు 200కు పైగా దీవులు ఉన్నాయి.అలాగే వాటిలో ప్రత్యేకమైన దీవిలలో కిన్హూ దీవి కూడా ఒకటి.అయితే ఈ దీవిలో నివసించే ఆడవాళ్ళ పద్ధతులు అలవాట్లు చాలా భిన్నంగా ఉంటాయి.

నిజానికి ఇక్కడ అందరూ మహిళలే ఉంటారు.వయసు పైబడిన వృద్ధ పురుషులు, పిల్లలు మాత్రమే ఉంటారు.

ఇక యవ్వన వయోజన దశలో ఉన్న మగవాళ్లు కనిపించకపోవడం ఆశ్చర్యం అనే చెప్పాలి.ఎందుకంటే అక్కడ సర్వహక్కులు మహిళలవే.

ఏమి చేసినా మహిళలే చేయాలి.

Telugu Works, Rituals, Kinhu Island, Marriages, Russias Estonia, Latest, Womens-

వ్యవసాయం దగ్గర నుండి ఇంటి పనులు, పెళ్లి, పురుడు, కర్మకాండ ఇలా ప్రతీ పనిని అక్కడ ఆడవారే నిర్వహిస్తారు.మరి ఆడవాళ్లు అన్ని పనులు చేస్తుంటే మగవాళ్ళు ఏమి చేస్తారు అనుకుంటున్నారా.వయసులో ఉన్న మగవారు చేపల వేటకు వెళ్లి నెలల తరబడి సముద్ర తీరప్రాంతాల్లోనే ఉంటారు.

చేపల వేటనే వారి ప్రధాన వృత్తి.అప్పడప్పుడూ ఇళ్లకు వెళ్లి తమ కుటుంబ సభ్యులను చూసుకుంటారు.

ఇక ఇల్లు పిల్లల బాధ్యత మొత్తం ఆడవారికే అప్పజెప్తారు.కాగా కిన్హూ దీవిలో ఉండే ఈ ప్రత్యేకమైన ఆచారాలు కేవలం ఇప్పటివి కాదు.

వందల ఏళ్లుగా ఇదే ఆచారం కొనసాగుతోందట.అక్కడ ఆడవాళ్లే అన్ని పనులు చూసుకుంటూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube