వివాదంలో చిక్కుకున్న విజయ్ సేతుపతి.. చివరకు..?

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో హీరో, విలన్ పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు విజయ్ సేతుపతి.96 సినిమాలో సహజమైన నటనతో విజయ్ సేతుపతి ప్రశంసలు అందుకున్నారు.నిన్న విజయ్ సేతుపతి పుట్టినరోజు కాగా సెట్ లో విజయ్ పెద్ద కత్తితో కేక్ ను కట్ చేశారు.ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ కాగా ఫోటో గురించి నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి.

 Vijay Sethupathi Birthday Celebration Become Controversy, Become Controversy, Bi-TeluguStop.com

ప్రస్తుతం విజయ్ సేతుపతి తమిళంలో పొన్రం అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.ఆ సినిమాలో ఖడ్గంకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది.

యూనిట్ సభ్యులు కోరడంతో విజయ్ సేతుపతి ఖడ్గంతో కేక్ ను కట్ చేశారు.కొందరు నెటిజన్లు విజయ్ సేతుపతి గుండాలు కట్ చేసినట్లు కత్తితో కేక్ ను కట్ చేయడం ఏమిటని.

గతంలో కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ఈ విధంగా చేస్తే వాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారని మరి విజయ్ ను కూడా అరెస్ట్ చేస్తారా.? అంటూ ప్రశ్నించారు.

Telugu Controversy, Uppena, Vijay Setupathi-Movie

విజయ్ సేతుపతి తాను ఖడ్గంతో కట్ చేయడం వివాదం అవుతుందని ఊహించలేదని.ఖడ్గానికి సినిమాలో ప్రాధాన్యత ఉండటం వల్లే అలా చేశానని.తప్పును పునరావృతం కాకుండా చూసుకుంటానని చెప్పుకొచ్చారు.ఎవరైనా తాను ఖడ్గంతో కేక్ కోయడం వల్ల బాధపడి ఉంటే క్షమించమని క్షమాపణలు కోరారు.విజయ్ క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదానికి తెరపడింది.

ఈ నెల 13వ తేదీన విడుదలైన మాస్టర్ సినిమాలో విలన్ పాత్రలో నటించి విజయ్ సేతుపతి మెప్పించారు.

ఉప్పెన సినిమాలో కూడా విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తున్నారు.వరుసగా విలక్షణ పాత్రల్లో నటిస్తూ విజయ్ సేతుపతి సినిమాసినిమాకు తన మార్కెట్ ను పెంచుకుంటూ ఉండటం గమనార్హం.

నిన్న ఉప్పెన సినిమా నుంచి విజయ్ సేతుపతి లుక్ విడుదల కాగా విజయ్ లుక్ కు నెటిజన్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube