Vijay : చిరంజీవి వీణ స్టెప్ ని కాపీ కొట్టిన తమిళ హీరో విజయ్.. నెట్టింట ఫోటోస్ వైరల్?

ఒక భాషలో విడుదల అయ్యి మంచి సక్సెస్ సాధించిన సినిమాను మరొక భాషలో రీమేక్ చేయడం అన్నది ఎప్పటినుంచో వస్తున్న విషయం తెలిసిందే.ఇటీవల కాలంలో రీమేక్ సినిమాల ట్రెండ్ బాగా పెరిగిపోయింది.

 Vijay Copy Chiranjeevi Indra Movie Veena Step In His Movie Songs-TeluguStop.com

గతంలో మన తెలుగు సినిమాలు తమిళ్ లో, తమిళ్ సినిమాలు తెలుగులో ఎక్కువగా రీమేక్ అయ్యేవి.సినిమాలతో పాటు సాంగ్స్, మ్యూజిక్ కూడా గతంలో చాలానే రీమేక్ చేయడం లేదా కాపీ కొట్టడం చేసేవాళ్ళు.

తమిళ్ స్టార్ హీరో విజయ్( Vijay ) అయితే అతని కెరీర్ లో దాదాపు సగం సినిమాలు తెలుగు రీమేక్ లే చేశారు.

Telugu Chiranjeevi, Indra, Tamila Vijay, Tollywood, Veena-Movie

కేవలం సినిమాలే కాకుండా అందులో సాంగ్స్, డ్యాన్సులు, పాటలు కూడా రీమేక్ చేసేవాళ్ళు.మన తెలుగులో మెగాస్టార్ చిరంజీవి చేసిన ఇంద్ర సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే.ముఖ్యంగా ఈ సినిమాలో దాయి దాయి దామ్మా సాంగ్ లో వచ్చే వీణ స్టెప్ కూడా బాగా పాపులర్ అయింది.

సినిమా విడుదల అయినా తర్వాత కొంతకాలం ఎక్కడ చూసినా కూడా ఈ పాట వినిపించడంతో పాటు ఎవరు చూసినా ఈ స్టెప్పుకు డాన్సులు వేశారు.ఇప్పటికీ ఈ పాట ఎక్కడైనా వినిపిస్తే చాలు వెంటనే మనకు మైండ్ లో వీణ స్టెప్ గుర్తుకు వస్తుంది.

Telugu Chiranjeevi, Indra, Tamila Vijay, Tollywood, Veena-Movie

అయితే ఆ వీణ స్టెప్ కూడా తమిళ్ హీరో విజయ్ ఓ సినిమాలో కాపీ కొట్టారు.ఇంద్ర సినిమా( Indra movie ) 2002లో రాగా విజయ్ 2003లో తిరుమలై అనే ఒక సినిమాతో వచ్చారు.ఈ సినిమాలో జ్యోతిక హీరోయిన్ గా నటించింది.తిరుమలై సినిమాలో తంతకా ధీంతక.అనే ఒక సాంగ్ ఉంది.ఈ పాటలో విజయ్ చిరంజీవి వేసిన వీణ స్టెప్ వేస్తాడు.

పాట మొత్తం డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ కూడా ఉంటాడు.లారెన్స్( Raghava Lawrence ) కూడా విజయ్ తో కలిసి వీణ స్టెప్ వేస్తాడు.

అయితే ఇంద్ర సినిమాలో చిరంజీవితో వీణ స్టెప్ వేయించింది కూడా లారెన్సే.అయితే ఇప్పుడు విజయ్ వీణ స్టెప్ వైరల్ అవుతుండటంత బాస్ చేస్తే స్టెప్ లో గ్రేస్ ఉంటుంది.

విజయ్ ఏదో డ్యాన్స్ వేయాలని వేసాడు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube