తెలంగాణ రాష్ట్రంలో వేసవికాలం ప్రారంభంలోనే విద్యుత్ కు అత్యధిక డిమాండ్ నెలకొంది.ఈ నేపథ్యంలో ఇవాళ విద్యుత్ ఆల్ టైం రికార్డ్ సాధించింది.
నిన్నటి కంటే ఇవాళ అత్యధికంగా విద్యుత్ డిమాండ్ నెలకొందని తెలుస్తోంది.
ఉదయం 10 గంటల వరకు 14,350 మెగావాట్ల విద్యుత్ వాడకం జరిగింది.
నిన్న సాయంత్రం 4 గంటల వరకు 14,169 మెగావాట్ల విద్యుత్ ను వినియోగించారు.ఈ నేపథ్యంలో మే నెల వరకు 15 వేల మెగావాట్ల వరకు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.