మానవుని గుండెలోకి చేరుతున్న మైక్రోప్లాస్టిక్స్.. షాకింగ్ విషయాలివే!

ఆశ్చర్యంగా వున్నా మీరు విన్నది నిజమే.వరల్డ్‌ వైడ్‌గా పెరుగుతున్న ప్లాస్టిక్( Plastic ) వాడకం పర్యావరణంతోపాటు మానవాళి ఆరోగ్యం పై కూడా ప్రభావం చూపుతోందని అమెరికన్ కెమికల్ సొసైటీ నివేదికలు కొన్నాళ్ల క్రితం పేర్కొన్నాయి.

 Microplastics Entering The Human Heart.. Shocking Things, Microplastics , Lates-TeluguStop.com

ఈ నేపథ్యంలో తాజాగా చైనాలోని బీజింగ్ అంజెన్ హాస్పిటల్‌‌కు చెందిన కున్ హువా, జియుబిన్ యాంగ్ అనే శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం కూడా మరో పిడుగులాంటి అంశాన్ని వెల్లడించింది.అవును, భూ వాతావరణంతోపాటు అనేక పదార్థాల్లో, చివరికి మానవ రక్తంలో, ఊపిరితిత్తుల్లో కూడా మైక్రోప్లాస్టిక్ చేరుతోందని వారు మిక్కిలి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Telugu Latest, Microplastics, Ups, Heart-General-Telugu

ఇక్కడ బాధాకర విషయం ఏంటంటే.మానవ హృదయాల్లోకి వేలకొద్దీ మైక్రో ప్లాస్టిక్స్( Microplastics ) కణాలు చేరుతున్నాయని కనుగొన్నారు.వాటికి మనిషి వేసుకొనే బట్టలు కారణం అవుతున్నాయని చెబుతున్నారు.మట్టిలో, నీళ్లల్లో, మంచులో, వేసుకునే దుస్తుల్లో ఐదు మిల్లీమీటర్లకంటే తక్కువ పొడవైన ప్లాస్టిక్ ముక్కలు కలిగి ఉంటాయట.

అవి నోరు, ముక్కు, కావిటీస్ ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు.చైనీస్ సైంటిస్టులు తమ పైలట్ ఎక్స్‌పైరిమెంట్‌లో భాగంగా మైక్రో ప్లాస్టిక్ కణాలు పరోక్ష, ప్రత్యక్ష బహిర్గతం ద్వారా ప్రజల కార్డియో వాస్క్యులర్ వ్యవస్థల్లోకి ఎలా ప్రవేశిస్తాయనేది లోతుగా స్టడీ చేయగా అందులో భయంకరమైన విషయాలు వెల్లడయ్యాయి.

Telugu Latest, Microplastics, Ups, Heart-General-Telugu

ఈ ప్రక్రియలో భాగంగా వారు హార్ట్ సర్జరీల( Heart Surgery ) సమయంలో 15 మంది వ్యక్తుల నుంచి గుండె కణజాల నమూనాలను సేకరించారు.అలాగే పలువురిలో సర్జరీకి ముందు, సర్జరీ అనంతరం కూడా బ్లడ్ శాంపుల్స్‌ను తీసుకున్నారు.ఆ తరువాత లేజర్ డైరెక్ట్ ఇన్‌ఫ్రారెడ్ ఇమేజింగ్‌తో నమూనాలను ఎనలైజ్ చేశారు.ఈ సందర్భంగా పరిశోధకులు 8 రకాల ప్లాస్టిక్‌తో తయారు చేసిన 20 నుంచి 500 మైక్రోమీటర్ల వెడల్పు కణాలను కనుగొన్నారు.

వీటిలో ఎక్కువగా పాలిథిలిన్ టెరెఫ్తాలేట్ ఉన్నట్లు గుర్తించారు.ఎక్కువగా దుస్తులు, ఫుడ్ కంటైనర్లలో, విండో ఫ్రేములు, డ్రైనేజీ పైపులు, ఇండ్లకు వేసే పెయింట్‌లలో మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉంటున్నాయని కూడా శాస్త్రవేత్తులు కనుగొన్నారు.

అందుకే ఏ రకంగా అయినా, ప్లాస్టిక్ వాడకం తగ్గకపోతే భవిష్యత్తులో ప్రపంచ మానవాళి ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube