వీడియో: ఆకాశంలో అద్భుత దృశ్యం.. పర్ఫెక్ట్‌గా రికార్డ్ చేసిన ఆస్ట్రోనాట్..

ఆకాశంలో మనం చూడని ఎన్నో అద్భుతమైన ఘటనలు చోటు చేసుకుంటాయి.ఇవి నేరుగా కళ్ళతో చూస్తే కనిపించవు.

 Video: Amazing View In The Sky Perfectly Recorded By An Astronaut, Viral News,-TeluguStop.com

వ్యోమగాములు స్పెషల్ ఎక్విప్‌మెంట్స్‌తో వీటిని ఫోటో లేదా వీడియో తీయడం ద్వారా వెలుగులోకి వస్తుంటాయి.తాజాగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ( ISS )లో పనిచేస్తున్న వ్యోమగామి ఆండ్రియాస్ మోగెన్‌సెన్, ఎగువ వాతావరణంలో సంభవించే అరుదైన ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ దృశ్యాన్ని క్యాప్చర్ చేశారు.

రెడ్ స్ప్రైట్ అని పిలిచే ఈ అద్భుతమైన ఘటన భూమి పైనుంచి చూస్తే కనిపించడం దాదాపు అసాధ్యం.చాలా అరుదైన కేసెస్‌లోనే ఈ దృశ్యం కనిపిస్తుంది.

ఆ అరుదైన సందర్భాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ఆస్ట్రోనాట్ ఒక ఫొటో, వీడియో తీయగలిగారు.స్పేస్‌లో జరిగే ఎలక్ట్రిక్ డిశ్చార్జ్‌లను ట్రాన్సియెంట్ ల్యుమినస్ ఈవెంట్ ( TLE ) అంటారు.

థోర్-డేవిస్ ప్రయోగంలో భాగంగా మొదటిసారిగా ఈ విశేషమైన ఫీట్ రికార్డ్ అయ్యింది.

రెడ్ స్ప్రైట్స్‌( Red sprites )ను తరచుగా జెల్లీ ఫిష్ లాంటి టెండ్రిల్స్‌తో పోల్చుతారు.ఇవి భూమి నుండి 40 మరియు 80 కిలోమీటర్ల మధ్య సంభవించే తెలియాడే విద్యుత్ డిశ్చార్జ్‌లు, ఇవి సాంప్రదాయ మెరుపు దాడుల కంటే చాలా ఎక్కువ ఎత్తులో జరుగుతాయి.ఈ అంతుచిక్కని ఘటనలు భూమి నుంచి చాలా అరుదుగా కనిపిస్తాయి కాబట్టి, వ్యోమగామి మోగెన్సెన్ తీసిన దృశ్యం చాలా విలువైనదని చెప్పుకోవచ్చు.

మోగెన్‌సెన్ ప్రతి శనివారం ISS కుపోలా అబ్జర్వేటరీ నుంచి తుఫానులను ఫొటో తీయడానికి సమయం వెయిట్ చేస్తారు.థోర్-డేవిస్ ప్రయోగానికి కంటిన్యూగా ఆయన ఎంతో కాంట్రిబ్యూషన్స్ అందించారు.అతని డెడికేషన్ ఎట్టకేలకు అద్భుతమైన దృశ్యాన్ని క్యాప్చర్ చేయడంతో ఫలించింది, అంతేకాదు, ఈ రహస్యమైన ట్రాన్సియెంట్ ల్యుమినస్ ఈవెంట్ల గురించి శాస్త్రవేత్తలకు కీలకమైన అవగాహనలు అందించింది.స్పేస్ లోని ఎలక్ట్రికల్‌ డిశ్చార్జ్‌ల ఫొటో, వీడియోను ఎక్స్‌ సోషల్ మీడియాలో పంచుకుంటూ, మోగెన్‌సెన్ ఈ అనుభవాన్ని “మేఘాలకు మించిన అద్భుతమైన ప్రపంచం”గా అభివర్ణించారు.

పిడుగులు పడిన తర్వాత రెడ్ స్ప్రిట్‌లు ఏర్పడతాయని, వాతావరణంలో చాలా ఎత్తులో కనిపిస్తాయని పేర్కొంటూ అతను వివరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube