మంచు మనోజ్, భూమా మౌనికల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిందనే సంగతి తెలిసిందే.తక్కువ సంఖ్యలో సెలబ్రిటీలు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.
మంచు మనోజ్ కు అత్యంత సన్నిహితులలో వెన్నెల కిషోర్ ఒకరు.మనోజ్ హీరోగా తెరకెక్కిన పలు సినిమాల్లో వెన్నెల కిషోర్ కమెడియన్ రోల్ లో కనిపించి తన నటనతో మెప్పించారు.
మనోజ్ పెళ్లి సందర్భంగా వెన్నెల కిషోర్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నమ్మి వస్తే గుండెల్లో పెట్టుకుంటాడు.
దటీజ్ మనోజ్ అంటూ వెన్నెల కిషోర్ చెప్పుకొచ్చారు.పెళ్లి, మ్యారేజ్, మూడు ముళ్ల బంధం, ఆరడుగుల అనుబంధం.
సారీ మా వాడు ఆరడుగులు కదా బ్రేక్ ద రూల్స్ అంటూ వెన్నెల కిషోర్ పేర్కొన్నారు.ఎం, ఎం ఫ్రెండ్స్ కదా అలానే ఉంటాయి మరి అంటూ మనోజ్, మౌనిక గురించి ఆయన పేర్కొన్నారు.
వయస్సులో సంబంధం లేకుండా రేంజ్ చూడకుండా నచ్చితే మావాడు, మెచ్చితే మనోడు అదే మంచు మనోజ్ స్టైల్ అని వెన్నెల కిషోర్ చెప్పుకొచ్చారు.
మంచు మనోజ్ కు డిగ్రీ సర్టిఫికెట్లు ఎన్ని ఉన్నాయో తెలీదు కానీ స్కూల్ ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్లు మాత్రం 14 ఉన్నాయని మనోడికి విదేశాల్లో చదివిన సీమ బిడ్డ భూమా మౌనికతో దేవుడు ముడి వేశాడని వెన్నెల కిషోర్ అన్నారు.వీళ్లిద్దరిదీ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అని మనోజ్ నమ్మితేనే చేయందిస్తాడని నమ్మి వస్తే గుండెల్లో పెట్టుకుంటాడని కిషోర్ కామెంట్లు చేశారు.ఏడడుగులు, ఏడేడు జన్మల వరకు అలాగే ఉండాలని కోరుకుంటున్నానని హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ వెన్నెల కిషోర్ తన పోస్ట్ ను ముగించారు.
వెన్నెల కిషోర్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.వివాదాలకు దూరంగా ఉండే సెలబ్రిటీలలో వెన్నెల కిషోర్ ఒకరు.వెన్నెల కిషోర్ వరుస సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.కెరీర్ విషయంలో వెన్నెల కిషోర్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు.