ఇదేందయ్యా ఇది, వందే భారత్ ట్రైన్ థీమ్‌లో రెస్టారెంట్ స్టార్ట్.. ఎక్కడంటే..

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇండియాలో సూపర్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే.కాస్త ఎక్కువ అయినా వీటిలో ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా, సౌకర్యవంతంగా ఉంటుంది.

 Vande Bharat Train Themed Restaurant In Surat Video Viral Details, Vande Bharat-TeluguStop.com

అంతేకాదు ఇవి గంటకు 130 కంటే ఎక్కువ స్పీడ్ తో దూసుకెళ్తూ గమ్యస్థానాలకు త్వరగా చేర్చుతాయి.వందే భారత రైల్వే సర్వీస్( Indian Railways ) నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభించబడింది.

అనేక సాధారణ రైల్వే ప్రయాణీకులను ఆకర్షించింది.

ఈ రైలు థీమ్‌తో గుజరాత్‌ రాష్ట్రం, సూరత్‌ నగరంలోని( Surat ) ఓ రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది.

ఈ రెస్టారెంట్ ఓనర్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు వందే భారత్( Vande Bharat ) థీమ్‌తో మొత్తం హోటల్ను డిజైన్ చేశాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.

రెస్టారెంట్ ఎంట్రన్స్ వద్ద రైలు ప్రతిరూపాన్ని మనం చూడవచ్చు.లోపలి భాగం భారతీయ ప్రకృతి దృశ్యాలు, రైలు సంబంధిత వస్తువుల రంగురంగుల చిత్రాలతో అలంకరించబడింది.

అంతే కాదు ఈ రెస్టారెంట్‌లో రూమ్స్, సీట్లు వందే భారత్ ట్రైన్ బోగీలను, సీట్లను పోలి కనిపించాయి.

రెస్టారెంట్( Restaurant ) ఆహార ప్రియులకు కల్చరల్ రియల్లిస్టిక్, మీల్స్ ఎక్స్‌పీరియన్స్ అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.చటోరా అంకిత్ అనే ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు పోస్ట్ చేసిన వీడియోలో రెస్టారెంట్ కనిపించింది.వీడియో రెస్టారెంట్ వెలుపలి, లోపలి భాగాన్ని అలాగే మెనూ అందించే వివిధ రకాల వంటకాలను చూపించింది.

ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది, చాలా పాజిటివ్ కామెంట్స్ చేశారు.ఈ రెస్టారెంట్ భోజనానికి రూ.269, డిన్నర్‌కు రూ.289 నిర్ణీత ధరతో అన్‌లిమిటెడ్ ఫుడ్ అందిస్తుంది.

ఆహారంలో రెండు రకాల సూప్, ఏడు రకాల చాట్, 10 రకాల కోల్డ్ సలాడ్, రెండు రకాల గార్లిక్ బ్రెడ్, మూడు రకాల పిజ్జాలు ఉన్నాయి.ఈ రెస్టారెంట్‌లో సౌత్ ఇండియన్, పంజాబీ వంటకాలు, అలాగే కోల్డ్ డ్రింక్స్, డెజర్ట్‌లు కూడా లభిస్తాయి.ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు లక్ష దాకా లైక్స్ వచ్చాయి, 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.చాలా మంది తమకు ఈ రెస్టారెంట్ నచ్చిందని, దానిని సందర్శించాలని ఉందని వ్యాఖ్యానించారు.“వావ్ ఈ రెస్టారెంట్ అద్భుతంగా ఉంది దీనికి ఒక్కసారైనా వెళ్లాల్సిందే.” అని ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube