నేటి నుండి ఏపీలో వ్యాక్సినేషన్..!

కొద్దిపాటి గ్యాప్ తర్వాత మళ్లీ ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది.45 ఏళ్లు పై బడిన వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు.రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.ఈ దఫాలో ఆర్టీసీ, రైల్వే, బ్యాంకింగ్, పోర్ట్లు, ప్రజా పంపిణీ వ్యవస్థలో పనిచేసే వారికి వ్యాక్సిన్ వేయనున్నారు.

 Vaccination For 45 Years In Andhrapradesh From Today, 45 Years , Andhrapradesh ,-TeluguStop.com

వారిని హైరిస్క్ కేటగిరీగా గుర్తించి వీరందరికి వ్యాక్సిన్ వేస్తున్నారని తెలుస్తుంది.

రాష్ట్రంలో 13.13 లక్షల డోసుల టీకాని అందుబాటులో ఉన్నదని తెలుస్తుంది.1.55 లక్షల కొవాగ్జిన్ టీకాలను రెండో డోస్ గా ప్రజలకు ఇవ్వనున్నారు.11.58 లక్షల కొవిషీల్డ్ టీకాలు తొలి డోస్ గా ఇస్తారని తెలుస్తుంది.ప్రస్తుతం 45 ఏళ్లు పై బడిన వారికే ఈసారి టీకా వేస్తారని తెలుస్తుంది.

అయితే 18 నుండి 44 మధ్య వయసు గల వారికి ప్రస్తుతానికి వ్యాక్సిన్ వేయడం లేదని తెలుస్తుంది.ఇక రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు వెల్లడించారు సింఘాల్.

అంతేకాదు హాస్పిటల్స్ లో బెడ్లు ఖాళీలు కూడా ఉన్నట్టు చెప్పారుఇ. రాష్ట్రవ్యాప్తంగా 918 ఐసీయు బెడ్లు, 2867 ఆక్సిజన్ బెడ్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.

 ముందు 45 ఏళ్లు పడి బడిన వారందరికి వ్యాక్సిన్ పూర్తయితే ఆ తర్వాత 18 నుండి 44 ఏళ్ల వయసు గల వారికి వ్యాక్సిన్ వేస్తారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube