చిరు భజనకు అలవాటు పడి రియాలిటీకి దూరం అవుతున్నారు: రామ్ గోపాల్ వర్మ

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) హీరోగా నటించిన భోళా శంకర్ ( Bhola Shankar ) సినిమా వేడుకలో భాగంగా కమెడియన్ హైపర్ ఆది( Hyper Aadi ) చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం మనకు తెలిసిందే.మెగా హీరోలను పొగుడుతూ హైపర్ ఆది ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

 Using To Chiru Bhajan And Getting Away From Reality Ram Gopal Varma-TeluguStop.com

అయితే ఈ వ్యాఖ్యలు కాస్త పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారాయి.ఇలా ఈ వేదికపై చిరంజీవి గారి ముందే హైపర్ ఆది ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల రాంగోపాల్ వర్మ ( Ram Gopal Varma ) సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా ఈ విషయంపై చిరంజీవి హైపర్ ఆది గురించి ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.

జబర్ , హైపర్ లాంటి ఆస్థాన విదూషకుల భజన పొగడ్తలకి అలవాటుపడిపోయి , రియాల్టీకి మెగా దూరమవుతున్నారని అనిపిస్తోంది.పొగడ్తలతో ముంచే బ్యాచ్ కన్నా ప్రమాదకరమైనది మరి ఏదీ లేదు.రియాలిటీ తెలిసేలోపు రాజుగారు మునిగిపోతారు.

వారి పొగడ్తల విషయం నుంచి తప్పించుకోవాలి అంటే ఈ జాతిని మైల్ దూరం పెట్టాల్సిందే అంటూ ఈయన ట్వీట్ చేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక రాంగోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్ పై పలువురు వారి స్టైల్ లో కామెంట్స్ చేస్తున్నారు.

రాంగోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్ లో వాస్తవం ఉందని తెలిపారు.ఈ మధ్యకాలంలో చిరంజీవి ఇలాంటివారి పొగడ్తలకు మురిసిపోతున్నారని అయితే ఇది చాలా ప్రమాదకరమని ఈ విషయంలో మెగాస్టార్ గారు కాస్త అప్రమత్తమైతే బాగుంటుందని తెలియజేస్తున్నారు.అయితే ఇలాంటి వారు వేదిక ఎక్కి మాట్లాడే సమయంలో వారికంటూ కొన్ని లిమిట్స్ పెడితేనే బాగుంటుందని లేకపోతే హీరోల సినిమాలకే పెద్ద ప్రమాదకరంగా మారే పరిస్థితిలో ఏర్పడతాయని ఆది వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తూ చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube