ఎలక్ట్రిక్ స్కూల్ బస్సులు తప్పనిసరి.. 2035 నాటికి టార్గెట్, వాషింగ్టన్ యంత్రాంగం కార్యాచరణ

ప్రపంచవ్యాప్తంగా భూతాపం పెరిగిపోతున్న నేపథ్యంలో అన్ని దేశాలు వాతావరణ మార్పులపై ఫోకస్ పెట్టాయి.దీనిలో భాగంగా కర్బన ఉద్గారాలు తగ్గించే ప్రణాళికలను రూపొందిస్తున్నాయి.

 Us Washington Considers Mandating Electric School Buses By 2035 , Zero Emission-TeluguStop.com

అంతేకాదు.కాలుష్యాన్ని నియంత్రించేందుకు గాను ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, వినియోగాన్ని పెంచుతున్నాయి.

ఇందుకోసం పలు ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నాయి.భారతదేశం కూడా ఈ విషయంలో దూకుడుగానే వుంది.

ప్రస్తుతానికి ఎలక్ట్రిక్ కార్లు, మోటార్ సైకిల్స్, సైకిల్స్‌‌ను ప్రజలు వినియోగిస్తున్నారు.

ఇదిలావుండగా.వాషింగ్టన్ రాష్ట్ర యంత్రాంగం ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.2035 నాటికి ఎలక్ట్రిక్ స్కూల్ బస్సుల వినియోగాన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయించింది.ప్రస్తుతం వాషింగ్టన్ అంతటా దాదాపు 10,000 స్కూల్ బస్సులు తిరుగుతున్నాయి.కొత్తగా తీసుకొచ్చిన చట్టం ‘ఎస్‌బీ-5431’ ప్రకారం వాషింగ్టన్ స్కూల్ డిస్ట్రిక్ట్స్ ‘జీరో ఎమిషన్ స్కూల్’ బస్సులను కొనుగోలు చేయాల్సి వుంటుంది.

ఫిబ్రవరి 1న సెనేట్‌లో జరిగిన విద్యా విచారణ సందర్భంగా అనేక చట్టాలు చేయబడ్డాయి.జీరో ఎమిషన్ స్కూల్ బస్సులు పిల్లలకు, ప్రజారోగ్యానికి మంచి ప్రయోజనాలను కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Telugu Jill Denny, Leah Missick, Electric School, Maryland, York, Typical, Washi

‘‘ typical combustion-based ’’ రకం స్కూల్ బస్సుల్లోని గాలి నాణ్యత … సమీపంలోని రహదారి గాలి నాణ్యత కంటే అధ్వాన్నంగా వుందని వాషింగ్టన్ విశ్వవిద్యాలయ అధ్యయనంలో తేలిందని.వాషింగ్టన్ ఫిజిషియన్స్‌ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటికి చెందిన జిల్ డెన్నీ అన్నారు.ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లవాడు బస్‌స్టాప్‌లో వేచి వున్న దానికంటే వారి పాఠశాల బస్సులో ఎక్కువ కాలుష్య కారకాలను పీల్చుకుంటాడని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.క్లైమేట్ సొల్యూషన్స్‌కు చెందిన లేహ్ మిస్సిక్ కూడా బిల్లుకు మద్ధతుగా నిలిచారు.

ఈ ప్రతిపాదన విద్యార్ధుల ఆరోగ్యానికి మద్ధతుగా వుంటుందని చెప్పారు.అదే సమయంలో ఉద్గారాలను కూడా తగ్గించాలని కమిటీకి సూచించారు.

Telugu Jill Denny, Leah Missick, Electric School, Maryland, York, Typical, Washi

కాగా.అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో న్యూయార్క్, మేరీల్యాండ్ సహా అనేక రాష్ట్రాలు ఇలాంటి చట్టాన్ని ఆమోదించాయి.న్యూయార్క్‌లో 2017 నాటికి కొనుగోలు చేసే కొత్త పాఠశాలల బస్సులు ఖచ్చితంగా ఉద్గార రహితంగా వుండాలి.మేరీల్యాండ్ విషయానికి వస్తే.2025 నాటికి కొత్త పాఠశాల బస్సులు తప్పనిసరిగా ఎలక్ట్రిక్‌గా వుండాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube