అమెరికాలో మందగిస్తోన్న ఉద్యగ వృద్ధి .. 3.9 శాతానికి పెరిగిన నిరుద్యోగిత రేటు

అమెరికాలో ( America )ఉద్యోగ వృద్ధి రేటు అంచనా వేసిన దానికంటే ఎక్కువ మందగించినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.అలాగే నిరుద్యోగిత రేటు దాదాపు రెండేళ్ల గరిష్ట స్థాయికి (3.9 శాతం) చేరింది.శుక్రవారం విడుదలైన బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ( Bureau of Labor Statistics )నివేదిక ప్రకారం నాన్‌ఫార్మ్ పేరోల్‌లు అక్టోబర్‌లో 1,50,000లు పెరగ్గా.

 Us Job Growth Falters, Unemployment Rate Increases To 3.9% , America, Bureau Of-TeluguStop.com

నెలవారీ వేతన వృద్ధి మందగించింది.గడిచిన ఏడాది కాలంగా లేబర్ సరఫరాలో మెరుగుదల, నియామకాల వేగం తగ్గడం వల్ల క్రమంగా సాధారణీకరణకు చేరుకుంటున్న జాబ్స్ మార్కెట్‌లో కొన్ని బీటలు ఏర్పడుతున్నాయని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి.

Telugu America, Bureaulabor-Telugu NRI

నిరుద్యోగిత రేటు పెరుగుదలను అడ్డుకోవడంలో సత్ఫలితాలు కనిపిస్తున్నాయని నివేదిక తెలిపింది.నిరుద్యోగం పెరుగుదలను యజమానులు ఇప్పటి వరకు విస్తృతంగా నివారించారు.అయితే హౌస్‌హోల్డ్స్( Households ) సర్వేలో ఉద్యోగాన్ని కోల్పోయిన లేదా తాత్కాలికంగా ఉద్యోగాన్ని పూర్తి చేసిన వారి సంఖ్య 2,00,000కు పైగా వున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.

దేశంలో ట్రెజరీలు పుంజుకోగా.డాలర్ బలహీనపడింది.పెట్టుబడిదారులు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు పెంపుతో పరిస్ధితులు చక్కబడతాయని భావిస్తున్నారు.

Telugu America, Bureaulabor-Telugu NRI

ఆరోగ్య సంరక్షణ, సామాజిక సహాయం, ప్రభుత్వ చర్యలు పేరోల్‌ల లాభాలను పెంచాయి.ఇతర వర్గాల్లో అయితే స్వల్ప వృద్ధి, లేదంటే పూర్తిగా క్షీణతను చూసింది.అక్టోబర్‌లో తయారీ రంగంలో పేరోల్‌లు 35,000 తగ్గాయి.ఆ సమయంలో యునైటెడ్ ఆటోవర్కర్స్ యూనియన్ సమ్మె( United Autoworkers union strike ) ప్రభావం చూపించిందని విశ్లేషకులు తెలిపారు.

యూనియన్ సభ్యులు దేశంలోని అతిపెద్ద ఆటోమేకర్‌లతో తాత్కాలిక ఒప్పందాలను కుదుర్చుకున్నప్పటికీ తాత్కాలికంగానైనా దీని ప్రభావం కనిపించింది.కార్మికుల డిమాండ్‌ను తగ్గించడం వల్ల వేతన పెరుగుదలపై ఒత్తిడి తగ్గుతోంది.సగటు గంట ఆదాయాలు గత నెలలో 0.2 శాతం పెరిగాయి.ఇది అంతకుముందు ఏడాది కంటే 4.1 శాతం ఎక్కువ.కార్మికుల్లో మెజారిటీగా వున్న పర్యవేక్షక ఉద్యోగుల ఆదాయాలు రెండవ నెలలో 0.3 శాతం పెరిగాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube