గంగవ్వతో కలిసి నాటుకోడి కూర వండిన మంత్రి కేటీఆర్.. ముద్ద దిగాలంటే ముక్క ఉండాలంటూ?

మరికొన్ని రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి.ఎన్నికల సమరం నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ప్రజలను ఆకట్టుకోవాలనే ఆలోచనతో విభిన్నంగా అడుగులు వేశారు.

 Minister-ktr-participated-my-village-show-program Details Here Goes Viral , Min-TeluguStop.com

మై విలేజ్ షో టీమ్ ప్రోగ్రామ్( My village show program ) లో కేటీఆర్ పాల్గొనడంతో పాటు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.కేటీఆర్ ఈ విధంగా చేయడంతో సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

కేటిఆర్( KTR ) స్వయంగా నాటుకోడి వండటంతో పాటు పచ్చటి పొలాల మధ్య దావత్ చేసుకోగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.గతంలో మై విలేజ్ షో ప్రోగ్రామ్ కు వస్తానని మాటిచ్చిన కేటీఆర్ ఎట్టకేలకు ఆ మాటను నిలబెట్టుకున్నారు.

అనిల్ జీలా, అంజిమామతో కలిసి కేటీఆర్ నాటుకోడి కూరతో పాటు బగార రైస్, గుడాలు వండారు.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Telugu Brs, Cm Kcr, Gangavva, Kavitha, Ktr, Show Program-Movie

గంగవ్వ కేటీఆర్( Gangavva ) ను ప్రశ్నలు అడగగా ఆ ప్రశ్నలకు కేటీఆర్ తనదైన శైలిలో జవాబులు ఇచ్చారు.ముద్ద దిగాలంటే ముక్క ఉండాలంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.కేసీఆర్( CM KCR ) ను ఇంట్లో డాడీ అని పిలుస్తానని బయట సార్ అని పిలుస్తానని ఆయన తెలిపారు.అమెరికాలో ఉన్న సమయంలో తన పనులు తానే చేసుకునేవాడినని కేటీఆర్ వెల్లడించారు.

Telugu Brs, Cm Kcr, Gangavva, Kavitha, Ktr, Show Program-Movie

కవిత తనకు అక్క అవుతుందని అందరూ అనుకుంటారని కవిత చెల్లి అవుతుందని ఆయన తెలిపారు.వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు అమలు చేస్తున్న పథకాల గురించి కూడా కేటీఆర్ కీలక విషయాలను చెప్పుకొచ్చారు.మంత్రి కేటీఆర్ వినూత్న ప్రచారం అధికార పార్టీకి ఏ స్థాయిలో కలిసొస్తుందో చూడాల్సి ఉంది.పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొనిరావడానికి కేటీఆర్ ఎంతో కష్టపడుతుండగా ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందో లేదో మరికొన్ని నెలల్లో తెలిసిపోనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube