Urvashi Rautela : ఐఐటీయన్ గా ప్రముఖ హీరోయిన్.. నెటిజన్స్ దారుణ కామెంట్స్?

ఊర్వశి రౌతౌలా( Urvashi rautela ).ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

 Urvashi Rautela : ఐఐటీయన్ గా ప్రముఖ హీరో�-TeluguStop.com

వాల్తేరు వీరయ్య సినిమాలో వేర్ ఇస్ ద పార్టీ అంటూ స్టెప్పులను ఇరగదీసిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో ప్రేక్షకులకు బాగా చేరువఅయ్యింది.ఈ పాట విడుదలైన తర్వాత ఒక్కసారిగా భారీగా పాపులారిటీని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

అలాగే ఇటీవలే విడుదలైన అఖిల్ మూవీ ఏజెంట్‌( Agent ) లో కూడా స్పెషల్ సాంగ్ వైల్ట్ సాలా అంటూ అభిమానులను ఊర్రూతలుగించింది.ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో ఈ ముద్దుగుమ్మ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉంది.

తరచూ ఏదోక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది ఊర్వశి.ఇకపోతే తాజాగా ఊర్వశి రౌతేలా మరోసారి ట్రోల్స్‌కు గురైంది.అందుకు గల కారణం కూడా లేకపోలేదు.తన సోషల్ మీడియా ఖాతాలో ఐఐటీయన్ అని పేర్కొనడం పై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.ఆమెకు కొత్త కారు, కొత్త ఇల్లు ఉండవచ్చు కానీ ఆమె ఐఐటీయన్ అని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందంటూ కామెంట్స్ పెడుతున్నారు.అయితే ఇదంతా ఆమె గతంలో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బయోలో ఐఐటీయన్‌గా పేర్కొంది.

ఇది చూసిన కొందరేమో ఆమె అప్పట్లో ఐఐటీలో చేరాలనుకున్నది అంటూ పోస్ట్ చేశారు.

ఆ తర్వాత ఐఐటీయన్ అన్న ట్యాగ్‌ను సోషల్ మీడియా ( Social media )ఖాతా నుంచి తొలగించింది.కానీ ఆమె అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రం ఇప్పటికీ ఐఐటీయన్‌ గానే చూపిస్తోంది.కాగా గతంలో ఊర్వశి ఒక ఈవెంట్‌ లో భాగంగా మాట్లాడుతూ తాను సైన్స్ గ్రాడ్యుయేట్ అని తెలిపింది.

అంతే కాకుండా ఐఐటీ ఎంట్రన్స్‌ను క్లియర్ చేశానని చెప్పింది.ఆ తర్వాత తాను ఐఏఎస్‌ కోసం కూడా సిద్ధమైనట్లు వివరించింది.చివరికీ ఏరోనాటికల్ ఇంజనీర్ కావాలనుకున్నట్లు తెలిపింది.కానీ ఆమె మోడలింగ్ వైపు అడుగులు వేసింది.

మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొంది.ఆ తర్వాత సన్నీ డియోల్, అమృతా రావుతో కలిసి సింగ్ సాబ్ ది గ్రేట్‌తో బాలీవుడ్ అరంగేట్రం చేసింది.

ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube