స్వ గ్రామాల్లో ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌లు.. పెట్టుబడులు పెట్టేందుకు యూపీ ఎన్ఆర్ఐల ఆసక్తి

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎన్ఆర్ఐలు తమ జన్మభూమి అభివృద్ధిలో భాగం కావాలని నిర్ణయం తీసుకున్నారు.దీనిలో భాగంగా అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు ‘‘ఉత్తరప్రదేశ్ మాతృభూమి యోజన’’ ద్వారా తమ స్వగ్రామాలలో వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

 Up Nris Ready To Invest In Infra Projects In Their Own Villages Details, Up Nris-TeluguStop.com

యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ‘‘ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023’’ని శుక్రవారం ప్రారంభించింది.ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలు తమ గ్రామాలలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలలో సహకరించడానికి కార్పస్ ఫండ్ ఏర్పాటును ప్రకటించే అవకాశం వుంది.మూడు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది.

2021 సెప్టెంబర్ 15న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించిన ‘‘ఉత్తరప్రదేశ్ మాతృభూమి యోజన’’ ప్రకారం.రాష్ట్రంలో మూలాలు వున్న ఎన్ఆర్ఐలు వారి పూర్వీకుల గ్రామాల అభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టొచ్చు.అమెరికాలో స్థిరపడిన చాలా మంది ప్రవాసులు ఉత్తరప్రదేశ్‌లోని తమ స్వగ్రామాలలో వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లలో పెట్టుబడులు పెడతామని ప్రతిజ్ఞ చేశారు.

బులంద్‌షహర్ జిల్లాలోని ఖండోయ్ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ సంజీవ్ రాజోరా ప్రకారం.ఉత్తరప్రదేశ్ మాతృభూమి యోజనకు 2000 మంది ఎన్ఆర్ఐలు తమ సహకారం అందించడానికి సుముఖత వ్యక్తం చేశారు.

Telugu Gis, Summit, Investinfra, Lucknow, Sanjeev Rajora, Nris, Uttarpradesh-Tel

ప్రభుత్వ అధికారులు చెబుతున్న దానిని బట్టి.ఎన్ఆర్ఐల నుంచి సేకరించిన నిధులను వారి గ్రామాలలో అంగన్‌వాడీ సెంటర్, లైబ్రరీ, కమ్యూనిటీ సెంటర్, ప్లే గ్రౌండ్, పశువుల పెంపకం అభివృద్ధి కేంద్రం, అగ్నిమాపక కేంద్రం, ప్రాథమిక పాఠశాలల్లో వివిధ సౌకర్యాలను కల్పించడానికి వెచ్చిస్తారు.ఇదిలావుండగా.విదేశాలలో వున్న ప్రవాస భారతీయులు. ముఖ్యంగా యూపీ మూలాలను కలిగి వున్న వారితో బలమైన సాంస్కృతిక , ఆర్ధిక సంబంధాలను పెంపొందించడానికి ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించేందుకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ సిద్ధమైన సంగతి తెలిసిందే.విదేశాల్లో పనిచేయాలనే ఆసక్తి వున్న వారికి సహాయం చేయడానికి 100 మంది విదేశీ రిక్రూటర్లను సంప్రదించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Telugu Gis, Summit, Investinfra, Lucknow, Sanjeev Rajora, Nris, Uttarpradesh-Tel

కార్మికుల వలస ప్రక్రియకు రిక్రూటర్లు కూడా సహాయపడతారని ఇటీవల సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఇచ్చిన ప్రజెంటేషన్‌లో ఎన్ఆర్ఐ విభాగం తెలిపింది.రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి 500 మంది ప్రవాసులను ఎన్ఆర్ఐ విభాగం సంప్రదించనుంది.గడిచిన ఐదేళ్లలో 129 దేశాలలో వున్న ప్రవాసుల నుంచి 1,201 కోట్ల పెట్టుబడుల హామీని ప్రభుత్వం పొందింది.ఇక ఎన్ఆర్ఐల సమస్యల పరిష్కారం కోసం 2020 ఆగస్ట్ 24న యూపీ ప్రభుత్వం ఒక పోర్టల్‌ను ప్రారంభించింది.

దీనిలో భాగంగా 192 ఫిర్యాదులను పరిష్కరించింది.అలాగే ప్రభుత్వం 50 మంది ఎన్ఆర్ఐలను ఉత్తరప్రదేశ్‌ రత్న అవార్డుతో సత్కరించింది.

అలాగే గడిచిన ఐదేళ్లలో 563 ఎన్ఆర్ఐ కార్డులను విడుదల చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube