డాక్టర్ కావాల్సిన యశస్వి సింగర్ అవ్వడానికి కారణం ఆమెనా..?

ప్రజెంట్ సోషల్ మీడియా ను ఒక ఊపు ఊపుతున్న సింగర్ ఎవరు అంటే యశస్వి అని చెప్పవచ్చు.యశస్వి గురించి మన అందరికి తెలిసిందే.

 Unknown Facts About Singer Yasaswi Kondepudi Life, Singer Yasaswi Kondepudi, Yasaswi Kondepudi Biography, Yasaswi Lover Sri Jhansi, Saregamapa Singer, Zee Telugu Channel-TeluguStop.com

జీ తెలుగు ఛానెల్ లో ప్రసారమయ్యే సరిగమప….ది సింగింగ్ ఐకాన్ షో ద్వారా మన అందరికి సుపరిచితుడు అయ్యాడు.

యశస్వి కొండేపూడి అనే యువకుడు సరిగమప షో ద్వారా పరిచయం అయ్యి శర్వానంద్ నటించిన జానూ సినిమాలో లైఫ్ అఫ్ రామ్ అనే పాటను పాడాడు.ఆ పాట రాత్రికి రాత్రే ఒక పెద్ద సెన్సేషన్ క్రెయేట్ చేసింది.

 Unknown Facts About Singer Yasaswi Kondepudi Life, Singer Yasaswi Kondepudi, Yasaswi Kondepudi Biography, Yasaswi Lover Sri Jhansi, Saregamapa Singer, Zee Telugu Channel-డాక్టర్ కావాల్సిన యశస్వి సింగర్ అవ్వడానికి కారణం ఆమెనా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంకేముంది యశస్వి ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయాడు.సినిమాలో సంగీత దర్శకులు పాడిన పాటలు కన్నా మనోడు పాడిన పాటలనే అందరు ఇష్టపడుతున్నారు.

యశస్వి పాడిన పాటలు యూ ట్యూబ్ ని షేక్ చేస్తున్నాయి.అంతేకాకుండా టెన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి కూడా.

యశస్వికి చిన్నపటి నుండి సంగీతం అంటే ఇష్టం అంట.సంగీతం మీద ఉన్న ఆసక్తితో చిన్నప్పుడే సంగీతం నేర్చుకుని చిన్న చిన్న స్టేజి పెర్ఫార్మెన్సెస్ ఇస్తూ వచ్చాడు.తరువాత జీ తెలుగు ఛానెల్ లో అవకాశం తన టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేసి మన అందరి మనసులని గెలుచుకున్నాడు.

యశస్వి పాడిన పాటలను ఎంతో మంది అభిమానులు ఇష్టపడ్డారు.

తాను పాడిన లైఫ్ అఫ్ రామ్ పాట విని అతని అభిమానిగా మారిన ఒక అమ్మాయి అదే షో లో అతనికి లవ్ ప్రొపోజ్ చేసింది.అంతే కాకుండా ఆ పాట విన్న శర్వానంద్ యశస్వి ని మెచ్చుకుంటూ ట్వీట్ కూడా చేసాడు.

దీంతో యశస్వి కి మరింత గుర్తింపు వచ్చింది.అంతేకాకుండా పవన్ నటించిన వకీల్ సాబ్ సినిమాలోని మగువా… మగువా.

అనే పాటను కూడా పాడాడు.ఈ పాట విని సినిమాలో ఒరిజినల్ గా పాడిన శ్రీ శ్రీ రామ్ కూడా యశస్వి ని మెచ్చుకున్నాడు.

సాధరణంగా ఇలాంటి పాటలను జడ్జెస్ మెచ్చుకోవడం సాధారణంగా చూసే ఉంటాము.కానీ మొదటిసారి జడ్జెస్ తో పాటుగా, ఒరిజినల్ సింగెర్స్ కూడా మెచ్చుకోవడం అనేది ఇతని విషయంలోనే జరిగినది.

ఇక యశస్వి వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుంటే.ఇతను పుట్టి పెరిగింది కాకినాడ.

ఇతన్ని ముద్దుగా షన్ని అని పిలిస్తారట.భాష్యం స్కూల్ లో చదివాడు.

చదువులో ముందు ఉంటూనే పాటలు కూడా పాడుతూ ఉండేవాడు.అతడి తండ్రి పేరు శేఖర్ తల్లి పేరు శ్రీదేవి.

యశస్వి కి చిన్నతనంలోనే కీబోర్డ్ సంగీతం అంటే చాలా ఇష్టం.దాంతో కీబోర్డ్ నేర్చుకుంటూనే పాటలు పాడటం కూడా నేర్చుకున్నాడు.

ఎస్ ఎస్ వి తండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు.

అంతే కాకుండా మరొక విశేషం ఏమిటంటే ఒకసారి యశస్వి చిన్నతనంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు పాడిన ఒక పాటకి కీబోర్డు కూడా స్వయంగా తానే ప్లే చేశాడు.అప్పుడు బాలు గారి చేతులమీదుగా అవార్డు కూడా తీసుకున్నాడు.యశస్వికి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం.

ఇతను ఆంధ్రా కాలేజీలో మెడిసిన్ పూర్తి చేశాడు.వచ్చే ఏడాది డాక్టర్ కూడా అవుతాడు.

యశస్వి చెల్లి కూడా సంగీతం నేర్చుకుంటూ ఇతని ట్రూప్ లోనే పాటలు కూడా పాడుతూ ఉంటుందట.ఇంకా యశస్విని తన చిన్న నాటి నుండి ఒక అమ్మాయిని ఎంతో ప్రేమిస్తున్నాడు.

అయితే ఆ అమ్మాయి కూడా యశస్విని ప్రేమిస్తుంది.ఆ అమ్మాయి విషయానికి వస్తే ఆ అమ్మాయి పేరు శ్రీ ఝాన్సీ.

కాకినాడలో వీళ్లిద్దరూ ఒకటే స్కూల్లో చదువుకున్నారు.యశస్వి 7th క్లాసులో ఉన్నప్పుడు ఝాన్సీ కి ప్రపోస్ చేసాడంట.

మాత్రం తన రెండవ తరగతి లో ప్రేమ కు ఓకే చెప్పిందిఅయితే జాన్సీ మాత్రం తన ఎనిమిదవ తరగతిలో ప్రేమకు ఓకే చెప్పింది.అంటే 18, ఆగస్టు2009 న ఝాన్సీ తన ప్రేమని ఓకే చేసిందట.

అయితే ఆరోజును మర్చిపోకుండా ఉండడానికి ఆ డేట్ ను స్వయంగా తన చేతి మీద పచ్చ బొట్టు పొడిపించుకున్నాడు యశస్వి.దగ్గర దగ్గర ఇప్పటికి 11 సంవత్సరాలు అన్నమాట.

ఇన్ని సంవత్సరాలు అయినాగానీ వీళ్ళ ప్రేమ ఇంకా కొనసాగుతుందంటే వీల్లద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు.

జీ తెలుగు ఛానెల్ లో ఇటీవల జరిగిన త న్యూ ఇయర్‌ సెలబ్రేషన్‌లో భాగంగా `పార్టీకి వేళాయేరా` పేరుతో ఓ స్పెషల్‌ షోని నిర్వహించిన విషయం తెలిసిందే .ఈ ప్రోగ్రామ్ లో యశస్వి కి అనుకోని గిఫ్ట్ ఒకటి ఇచ్చారు షో నిర్వాహకులు.తన కళ్ళకి గంతలు కట్టి, తాను ఎంతగానో ప్రేమించిన ఝాన్సీని స్టేజి మీదకి రప్పించి యశస్వికి షాక్ ఇచ్చారు.

తన లవర్ ని చుసిన యశస్వి ముఖం ఆనందంతో మెరిసిపోయింది.తనని స్టేజి మీద ఎత్తుకుని తిప్పాడు .అంతేకాకుండా మొకాళ్ళ మీద కూర్చీని మరీ అందరి ముందు లవ్ ప్రపోజ్ చేసాడు.ఝాన్సీ కూడా యశస్వికి ముద్దు పెడుతుంది.

ఇది చుసిన వారందరు క్లాప్స్ కొట్టి మరీ వారిని అభినందించారు.జాన్సీ కూడా తన లైఫ్ లోకి వచ్చినందుకు యశస్వికి థాంక్స్ చెప్పింది.

ఇంకా జాన్సీ కూడా పలు వెబ్ సిరీస్ లోను, షార్ట్ ఫిలిమ్స్ లోను నటిస్తుంది.అంతేకాదు ఝాన్సీ కూడా పాటలు పాడుతూ ఉంటుంది.

ప్రస్తుతం బీఫార్మా చదువుతుంది.వచ్చే ఏడాది వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారు అని కూడా తెలుస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube