కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్ర విభజన తర్వాత క్రియశీలక రాజకీయాలకు దూరమయ్యాడు.మెుదట్లో రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్స్‌పై పోరాటం చేసి వెలుగులోకి వచ్చారు.
దివంగత వైఎస్‌ఆర్‌కు అత్యంత సన్నిహితుడైన ఉండవల్లి ఎప్పుడూ ఏపీ కాంగ్రెస్ పార్టీ బలహిన పడిన తర్వాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరకుండా పరోక్షంగా జగన్‌కు సాయపడుతూ వచ్చారు.ఈ మధ్య కాలంలో ప్రతి ప్రెస్ మీట్ లోనూ ఉండవల్లి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ పార్టీలో చేరేందుకు ఉండవల్లి ప్రయత్నిస్తున్నారని గోదావరి జిల్లాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రప్రభుత్వం చేస్తున్న సాయంపై నిజనిర్ధారణ జేఏసీలో పవన్ కళ్యాణ్ గతంలో ఉండవల్లిని చేర్చుకున్నారు.
పవన్ కళ్యాణ్ రాజకీయంపై ఉండవల్లికి పాజిటివ్ అభిప్రాయం ఉంది. వీలైనప్పుడల్లా పవన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
2019 ఎన్నికల ముందు కూడా పవన్ కళ్యాణ్ పోరాట పటిమపై ఉండవల్లి పాజిటివ్ కామెంట్స్ చేశారు.ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే.

ఆయన తర్వాలో జనసేనలో చేరుతారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.రాష్ట్ర విభజన తర్వాత ఉండవల్లి పరోక్ష రాజకీయాల్లో ఉన్నారు .రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో పోటీ చేయలేదు.మరి నిజంగానే ఆయన జనసేనలో చేరి యాక్టివ్ అవుతారో లేదో చూడాలి.
అదే జరిగితే టీడీపీ-బీజేపీ పొత్తు కుదిరే అవకాశం ఉందన్న ఊహాగానాల మధ్య ఈ విషయం చాలా ఆసక్తికరంగా మారనుంది.జనసేనలో చేరిన తర్వాత ఆయన వైసీపీపై ఎలా పోరాటం చేస్తారో అనేది చూడాలి.
పార్టీ సిద్దాంతాలకు తగ్గట్టుగా పని చేస్తారా? లేదా పార్ట్ టైమ్ రాజకీయ నాయకుడిగా ఉంటారా? ప్రశ్నగా మారింది.