విదేశీ కార్మికులపై ఆధారపడొద్దు.. మనోళ్లకే శిక్షణ ఇద్దాం : వలసలపై భారత సంతతి యూకే హోంమంత్రి వ్యాఖ్యలు

భారత సంతతికి చెందిన బ్రిటన్ హోం సెక్రటరీ సుయెల్లా బ్రేవర్‌మాన్( Britain’s Home Secretary Suella Braverman ) వలసలపై తీవ్రవ్యాఖ్యలు చేశారు.దేశంలోకి పోటెత్తుతున్న అస్థిరమైన, సామూహిక వలసలపై ఆమె తీవ్ర హెచ్చరికలు చేశారు.

 Uk's India-origin Home Secretary Suella Braverman Key Comments On Illegal Migrat-TeluguStop.com

పెరుగుతున్న వలసలను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని సుయెల్లా పిలుపునిచ్చారు.లండన్‌లోని నేషనల్ కన్జర్వేటిజం కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సుయెల్లా ప్రసంగిస్తుండగా.

వలసల గురించి కొందరు నినాదాలు చేశారు.దీంతో అసహనానికి గురైన సుయెల్లా బ్రేవర్‌మాన్ నిరసనకారులకు గట్టి సమాధానం ఇచ్చారు.

వలసలను నివారించడానికి తమ నిబద్ధతను చాటుకోవాలని పాలక కన్జర్వేటివ్ పార్టీకి ఆమె పిలుపునిచ్చారు.విదేశీ కార్మికులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు దేశంలోనే ఎక్కువ మంది కార్మికులకు శిక్షణ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని సుయెల్లా బ్రేవర్‌మాన్ అభిప్రాయపడ్డారు.

హౌసింగ్, సప్లయ్, పబ్లిక్ సర్వీసెస్, కమ్యూనిటీ రిలేషన్స్‌పరంగా సామూహిక, వేగవంతమైన వలసలు నిలకడలేనివని చెప్పడం జెనోఫోబిక్( Xenophobic ) కాదని ఆమె అన్నారు.అక్రమ వలసలను ఎదుర్కోవడంపై ప్రాధాన్యత ఇస్తున్నామని.

అయితే చట్టపరమైన వలసలను కూడా నియంత్రించాల్సిన అవసరం ఉందని సుయెల్లా స్పష్టం చేశారు.గతంలో బ్రెగ్జిట్‌కు అనుకూలంగా తాను ఓటు వేసిన సందర్భాన్ని కూడా సుయెల్లా గుర్తుచేశారు.

అధిక నైపుణ్యం కలిగిన కార్మికులు ఆర్ధిక వృద్ధికి మద్ధతు ఇస్తారని.ఎన్‌హెచ్ఎస్ మాదిరిగా లేబర్ మార్కెట్‌లో తీవ్రమైన కొరత వున్న చోట ఆ కొరతను పూడ్చటానికి చురుకైన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ వుండటం సరైనదన్నారు.

కానీ వలస కార్మికులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి దేశంలో తగినంతమంది ట్రక్ డ్రైవర్లు, బిల్డర్లు, పండ్ల తోటల్లో పనిచేసేవారికి శిక్షణ ఇవ్వాని సుయెల్లా బ్రేవర్‌మాన్ పిలుపునిచ్చారు.

Telugu Germany, Secretary, Uksindia-Telugu NRI

ఇకపోతే.బ్రిటన్‌లోకి అక్రమ వలసలను అరికట్టేందుకు గాను ప్రధాని రిషి సునాక్ “Stop the Boats” నినాదాన్ని అందుకున్నారు.వచ్చే ఏడాది ద్వితీయార్థంలో జరగనున్న సాధారణ ఎన్నికల ముందు ఇది ఆయన అభ్యర్ధిత్వానికి కీలకమైనదిగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది మార్చిలో హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రధాని రిషి సునాక్( Prime Minister Rishi Sunak ), హోమ్ సెక్రటరీ సుయెల్లా బ్రేవర్‌మాన్‌లు అక్రమ వలస బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

Telugu Germany, Secretary, Uksindia-Telugu NRI

చిన్న బిన్న పడవల్లో అక్రమంగా బ్రిటన్‌లోకి ప్రవేశించే వారిని అరెస్ట్ చేసి వారిని తిరిగి స్వదేశానికి లేదంటే మూడో దేశానికో పంపించాలని బిల్లు ప్రతిపాదించింది.అటువంటి వ్యక్తి తర్వాతి కాలంలో యూకేలోకి రాకుండా శాశ్వతంగా నిషేధించబడతాడు.ఫ్రాన్స్ నుంచి చిన్న పడవల ద్వారా యూకేకు అక్రమంగా తరలించేందుకు మానవ అక్రమ రవాణా ముఠాలు ఒక్కొక్కరి నుంచి 3000 పౌండ్లను వసూలు చేస్తున్నాయి.

ఇదొక పెద్ద రాకెట్.స్మగ్లింగ్ గ్యాంగ్‌లు డింగీలను ( చిన్న ప్లాస్టిక్ బోటు) టర్కీలో కొనుగోలు చేస్తాయి.అనంతరం వాటిని జర్మనీకి( Germany ) తరలించి, వాటిని ఫ్రాన్స్‌కు తీసుకెళ్తాయి.అక్కడి నుంచి అక్రమ వలసదారులను పడవల్లో ఎక్కించి ఇంగ్లీష్ ఛానెల్ మీదుగా బ్రిటన్‌కు చేరుస్తాయి.

అయితే మార్గమధ్యంలోనే పడవలు మునిగి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube