వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు మన సంస్కృతిని, ఆచార వ్యవహారాలను అక్కడ కూడా విస్తరిస్తున్నారు.అంతేకాకుండా మనకు మాత్రమే సొంతమైన వంటకాలను విదేశీయులకు కూడా రుచిచూపిస్తున్నారు.
అనకాపల్లి నుంచి అమెరికా వరకు ఇప్పుడు అన్ని దేశాలలో భారతీయ రెస్టారెంట్లు పరదేశీయులను కూడా ఆకట్టుకుంటున్నాయి.మన వంటకాల రుచికి వారు కూడా వహ్వా అనాల్సిందే.
అందుకే ఏ దేశంలో చూసినా మన హోటళ్లు, రెస్టారెంట్లు నిత్యం కిటకిటలాడుతూ వుంటాయి.ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మన భారతీయుల కంటే అక్కడి స్థానికులే ఎక్కువగా ఆ హోటళ్లకు ఎగబడుతున్నారు.
ఒక్కసారి టేస్ట్ చేస్తే చాలు దానికి ఎవరైనా ఫ్యాన్స్‌గా మారాల్సిందే.
ఇదిలావుండగా.యూకేలో స్థిరపడిన పంజాబీ సంతతి చెఫ్ సారా వుడ్స్ భారత ఉపఖండానికి చెందిన ఫేమస్ వంటకాల తయారీ, ఇతర వివరాలకు సంబంధించి రూపొందించిన ‘‘దేశీ కిచెన్’’ పుస్తకాన్ని గురువారం విడుదల చేశారు.ముఖ్యంగా దక్షిణాసియాకే సొంతమైన చికెన్ వంటకాలను సారా ఇందులో ప్రస్తావించారు.
భారత ఉపఖండంలోని పలు ప్రాంతాలకు చెందిన రుచులను అందించేందుకు గాను సారా నెలల తరబడి పరిశోధనలు చేశారు.శ్రీలంక కొన నుంచి హిమాలయాల వరకు వున్న రుచులను సారా తన పుస్తకంలో పొందుపరిచారు.
భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకలకు చెందిన వేలాది వంటకాలు వున్నప్పటికీ.తాను ప్రతి కమ్యూనిటీకి పది రుచులను మాత్రమే పరిమితం చేశానని సారా తెలిపారు.అయితే పంజాబీ కమ్యూనిటీకి మాత్రం పెద్ద చాప్టర్‌ను కేటాయించినట్లు చెప్పారు.ఎందుకంటే అది తన వారసత్వమని సారా వుడ్స్ అన్నారు.
యూకేలో స్థిరపడిన రెండవ తరం భారతీయ వలసదారు అయిన సారా వుడ్స్.తన కుటుంబంలోని కుక్‌లు, అతిథుల కోసం ఇంగ్లాండ్‌లోని వారి ఇంటి పెరట్లో తాందూర్ (తందూరి రోటిలను కాల్చే పాత్ర )ను నిర్మించారు.పంజాబీల ఇళ్లలో తాందూర్‌ల నిర్మాణం సహజంగానే వుంటుంది.తన తాత 1960ల ప్రారంభంలో యూకేకు వచ్చారని సారా వుడ్స్ పుస్తకంలో వెల్లడించారు.రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తీవ్రమైన కార్మికుల కొరత వుండటంతో యూకే తన ఆర్ధిక వ్యవస్థను పునర్నిర్మించుకోవడానికి కామన్‌వెల్త్ దేశాల నుంచి కార్మికులను రప్పించిందని ఆమె తెలిపారు.తన తాత ఇక్కడ స్థిరపడిన తర్వాత మిగిలిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను కూడా యూకేకు రప్పించారని.
ఈ క్రమంలో వారు పంజాబ్ నుంచి వారి అలవాట్లు, సంప్రదాయాలను తీసుకొచ్చారని సారా కొనియాడారు.