నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు.చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు రావడంతో హుటాహుటిన నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందించారు.మరికాసేపటిలో మెరుగైన చికిత్స కోసం మేకపాటిని చెన్నైకు తరలిస్తున్నారని సమాచారం.