ఊరెళ్తూ డస్ట్ బిన్‌లో డబ్బు దాచింది.. చివరికి ఏమైందంటే

నగరాలలో ఉండే వారు సెలవులకు ఊరు వెళ్లాలంటే చాలా భయపడతారు.ఇంటికి తిరిగి వచ్చే సమయానికి ఇంట్లో విలువైన వస్తువులు దొంగలు ఎత్తుకుపోతారనే అనుమానాలు ఉంటాయి.

 Two Jailed Stealing Money From Dustbin In Dubai Details, Viral Latest, News Vira-TeluguStop.com

దీంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ దొంగల వల్ల ఇంట్లో వస్తువులు మాయం అవుతాయి.

పోయిన విలువైన వస్తువులను తలుచుకుని చాలా మంది బాధితులు లబోదిబోమంటారు.పోలీసులను ఆశ్రయించి, దొంగలను పట్టుకుని తమ వస్తువులు తిరిగి వచ్చేలా చూడాలని ఫిర్యాదు చేస్తుంటారు.

సరిగ్గా ఇలాంటి అనుభవం ఓ మహిళకు ఎదురైంది.ఊరు వెళ్లతూ డబ్బు అంతా ఎవరూ ఊహించని ప్రదేశంలో దాచింది.

Telugu Dirhams, Dubai, Dust Bin, Journey, Moeny, Garbage, Jailed, Latest-Latest

అయినప్పటికీ దొంగలు వాటిని ఎత్తుకుపోయారు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.దుబాయ్‌లో ఓ మహిళ ఖరీదైన విల్లాలో ఉంటోంది.వేరే ప్రాంతానికి వెళ్తూ ఇంట్లోని డబ్బు 815,000 దిర్హమ్‌లు (భారత కరెన్సీలో రూ.1.83కోట్లు) ఎక్కడ దాచాలో ఆమెకు అర్ధం కాలేదు.చివరికి తెలివిగా ఆలోచించింది.ఆ డబ్బు మొత్తాన్ని డస్ట్‌ బిన్‌లో అడుగు భాగంలో పెట్టింది.తర్వాత నిశ్చింతగా ఊరు వెళ్లింది.తిరిగి వచ్చిన తర్వాత డస్ట్ బిన్‌లో డబ్బు కోసం చూడగా కనిపించలేదు.

దీంతో ఆమె షాక్ అయింది.పోలీసులను ఆశ్రయించి, వారికి ఫిర్యాదు చేసింది.

Telugu Dirhams, Dubai, Dust Bin, Journey, Moeny, Garbage, Jailed, Latest-Latest

పోలీసులు వచ్చి విల్లాను పరిశీలించారు.దర్యాప్తు బృందం ఆ ప్రాంతంలో సోదాలు చేసి ఆధారాలు సేకరించింది.వారు సీసీ కెమెరా ఫుటేజీని కూడా పరిశీలించారు.చివరికి ఇంట్లో పని చేసేందుకు వచ్చిన మెయింటెనెన్స్ వర్కర్లు ఆ డబ్బు కాజేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు.వారిని విచారించగా మొత్తం చెప్పేశారు.విల్లాలోని టెర్రస్‌పై చిన్న చెత్త కుండీలో దాచిన ఆ డబ్బును చోరీ చేసినట్లు అంగీకరించారు.

ఇద్దరూ డబ్బు పంచుకున్నట్లు తెలిపారు.తమ దేశంలో ఉండే కుటుంబాలకు ఆ డబ్బు పంపించినట్లు తెలిపారు.

వారిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube