Twitter Officials label : అఫీషియల్స్' లేబుల్ తీసుకురానున్న ట్విట్టర్.. ఎవరికి కేటాయిస్తారంటే

ట్విట్టర్‌‌ను హస్తగతం చేసుకున్నాక ఎలాన్ మస్క్ కొత్త కొత్త నిబంధనలు తీసుకొస్తున్నాడు.ఇప్పటి వరకు ట్విట్టర్ బ్లూ టిక్ కలిగి ఉన్న వారంతా, కొత్తగా అది కావాలనుకున్న వారంతా నెలకు 8 యూఎస్ డాలర్లు చెల్లించాలని పేర్కొన్నాడు.

 Twitter To Bring 'officials' Label Who Will Be Assigned Twitter, Official Logo,-TeluguStop.com

దీనిని కొందరు స్వాగతిస్తుండగా, చాలా మంది వ్యతిరేకిస్తున్నారు.ఈ క్రమంలో అందరూ నెలకు 8 డాలర్లు చెల్లిస్తే అందరి ఖాతాలు బ్లూ టిక్‌తో కనిపిస్తాయి.

దీంతో పలువురు డూప్లికేట్ ఖాతాలను ప్రముఖుల పేరిట తెరిచి, తప్పుడు ట్వీట్లు పెట్టే ప్రమాదం ఉంది.దీనిపై విమర్శలు రావడం, వాటిలో సహేతుకత ఉండడంతో ట్విట్టర్ నుంచి సరికొత్త ప్రకటన వచ్చింది.

అఫీషియల్స్ (Officials) అనే లేబుల్‌ను కొత్తగా తీసుకు రానుంది.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

గ్రే చెక్‌మార్క్‌తో కొత్త ‘అఫీషియల్స్’ బ్యాడ్జ్ ఇప్పుడు కొన్ని నిర్దిష్ట ఖాతాలకు అందుబాటులోకి వస్తోంది.ఖాతా కోసం ప్రొఫైల్ పేజీలో, మీ టైమ్‌లైన్‌లో ఖాతా పేరుతో పాటు గ్రే చెక్‌మార్క్‌తో కొత్త ‘అఫీషియల్స్’ బ్యాడ్జ్ కనిపించనుంది.

నెలకు 8 డాలర్లు చెల్లించే వారు ఎవరైనా బ్లూ టిక్ మార్క్ పొందుతారు.అయితే దీని వల్ల ఎదురయ్యే కొన్ని సమస్యలపై ట్విట్టర్ దృష్టిసారించింది.

Telugu Official Logo, Officials Label, Ups-Latest News - Telugu

ప్రభుత్వ సంస్థలు, ప్రముఖుల పేరుతో కొందరు నఖిలీ ఖాతాలను నడిపే అవకాశం ఉంది.వాటి నుంచి వచ్చే సందేశాలను సామాన్యులు నిజం అని భ్రమించే ప్రమాదం ఉంది.దీంతో ఈ సమస్యకు చక్కటి పరిష్కారాన్ని ట్విట్టర్ తీసుకు రానుంది.ఎంపిక చేసిన ఖాతాలు, వారి ప్రొఫైల్‌లలో బూడిద రంగు చెక్‌మార్క్‌తో సూచించబడే కొత్త “అఫీషియల్” లేబుల్‌ ఉంటుందని ట్విట్టర్ తాజాగా ప్రకటించింది.

ఈ కొత్త లేబుల్‌ను ప్రభుత్వ ఖాతాలు, వాణిజ్య సంస్థలు, వ్యాపార భాగస్వాములు, ప్రధాన మీడియా సంస్థలు, ప్రచురణకర్తలు, సెలబ్రెటీలకు కేటాయించనున్నట్లు ట్విట్టర్ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube