టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న స్టార్ నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు.ఈయన ప్రొడ్యూసర్ గా మాత్రమే కాదు పంపిణీ దారుడిగా కూడా మంచి పేరు ఉంది.
అయితే ఈయన కెరీర్ లో పంపిణీ దారుడిగా ఈయన భారీ లాభాలు కూడా గడించాడు.అయితే ఒక్కోసారి కొన్ని సినిమాల కారణంగా కొన్ని చిక్కులు కూడా ఎదుర్కున్న సందర్భాలు ఉన్నాయి.
మరి మరోసారి ఈయన చిక్కుల్లో పడ్డారు.
ప్రెజెంట్ దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాల్లో తమిళ్ సినిమా వరిసు కూడా ఉంది.
ఇప్పుడు ఈ సినిమా ఈయనకు చిక్కులు తెచిపెట్టెలాగానే ఉందట.ఎందుకంటే ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయడమే ఇందుకు కారణం అని తెలుస్తుంది.
టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి కాంబోలో ‘వారసుడు’ సినిమా తెరకెక్కుతుంది.
దిల్ రాజు భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.
తమిళ్ లో ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నప్పటికీ తెలుగులో మాత్రం కన్నెత్తి చూసే ప్రేక్షకులే ఉండరు.అయినా కూడా సంక్రాంతి వంటి పండుగ సీజన్ లోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని దిల్ రాజు గట్టి పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తుంది.

ఇక ఈసారి సంక్రాంతి బరిలో వీరసింహ రెడ్డి సినిమాతో బాలయ్య, వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి బరిలో దిగబోతున్నారు.అయితే దిల్ రాజు చేతిలో ఉన్న థియేటర్స్ అన్ని వారసుడు కోసం లాక్ చేసుకోవాలని భావిస్తున్నాడట.ఇదే ఇప్పుడు ఈయనకు సమస్య తెచ్చిపెట్టేలా ఉంది.ఎందుకంటే భవిష్యత్తులో బాలయ్య తో, మెగాస్టార్ తో సినిమాలు తీస్తాడు.

కానీ ఇప్పుడు ఈయన నిర్మిస్తున్న సినిమా కోసం థియేటర్స్ పెట్టుకుంటే దీని వల్ల చిరు, బాలయ్య సినిమాలకు థియేటర్స్ ఎక్కువ దొరికే అవకాశం కనిపించడం లేదు.మరి ఇలా చేస్తే దిల్ రాజు ఈ స్టార్ హీరోలకు విలన్ అవ్వడం ఖాయం.ఇలా జరగడం ఈయనకు ఇష్టం లేదట.అందుకే ఈ కష్టతరమైన పరిస్థుతుల నుండి ఈయన బయట పడడానికి ట్రై చేస్తున్నాడని టాక్.మరి ఎలా గట్టెక్కుతాడో చూడాలి.







