స్టార్ హీరో కారు దొంగతనం.. ఎలా చేశారంటే?

ప్రస్తుతమున్న టెక్నాలజీని ఉపయోగించుకుని దొంగలు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు.ఈ విధంగా టెక్నాలజీని ఉపయోగించి హాలీవుడ్ స్టార్ నటుడు టామ్ క్రూజ్ కారుని దొంగలు దొంగలించారు.

 Tom Cruises Bmw Luggage Stolen Tom, England, Smithwick, Car , Tom Cruze , Trak-TeluguStop.com

ఇలా దొంగలు దొంగతనం చేసిన ఆ కారు విలువ సుమారు కోటి రూపాయలు.ఎంతో విలువైన ఈ కారును దొంగలు దొంగతనం చేసే అందులో ఉన్న డబ్బులు లగేజీని తీసుకుని కారును వదిలి పారిపోయారు.

అసలు ఈ కారు దొంగతనం ఎలా జరిగింది అనే విషయానికి వస్తే.

ప్రస్తుతం టామ్ ఇంగ్లండ్‌లోని బ‌ర్మింగ్ హామ్‌లో మిషన్ ఇంపాజిబుల్ ఏడో పార్ట్ షూటింగ్ లో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే తన బీఎండబ్ల్యూ కారును హోటల్ బయట పార్క్ చేశారు.ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న కొత్త కార్లకు తాళాలకు బదులుగా ఇగ్నీష‌న్ వ‌స్తుండ‌గా, దానికి ఉన్న వైర్లెస్ ట్రాన్స్మిటర్ ను ఉపయోగించి దొంగలు ఈ దొంగతనానికి పాల్పడ్డారు.

ఈ క్రమంలోనే దొంగలు కారు తీసుకు వెళ్తుండగా ఆ హీరో బాడీగార్డ్స్ సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు.

Telugu Bharminghome, Bmw, England, Smithwick, Tom Cruises, Syastem-Movie

సమాచారం అందుకున్న పోలీసులు ట్రాకింగ్ సిస్టమ్ ఆధారంగా ఆ కారు ఎక్కడుందో గుర్తించారు.దొంగలు ఆ కారు దొంగతనం చేసి స్మెత్ విక్ అనే గ్రామంలో వదిలి వెళ్లారు.ఈ క్రమంలోనే పోలీసులు ట్రాకింగ్ సిస్టం ద్వారా ట్రేస్ చేసి కారును గుర్తించారు.

అయితే దొంగలు కారును ఏమీ చేయకుండా అప్పటికే అందులో ఉన్నటువంటి లగేజ్ కొంత డబ్బులను దొంగలు దోచుకెళ్లారని తెలుస్తోంది.దొంగలు దోచుకెళ్లారు ఈ కారు బీఎండబ్ల్యూ 7 గా పేరుగాంచింది ఇది మన కరెన్సీలో అక్షరాల కోటి రూపాయలు ధర పలుకుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube