స్టార్ హీరో కారు దొంగతనం.. ఎలా చేశారంటే?

ప్రస్తుతమున్న టెక్నాలజీని ఉపయోగించుకుని దొంగలు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు.ఈ విధంగా టెక్నాలజీని ఉపయోగించి హాలీవుడ్ స్టార్ నటుడు టామ్ క్రూజ్ కారుని దొంగలు దొంగలించారు.

ఇలా దొంగలు దొంగతనం చేసిన ఆ కారు విలువ సుమారు కోటి రూపాయలు.

ఎంతో విలువైన ఈ కారును దొంగలు దొంగతనం చేసే అందులో ఉన్న డబ్బులు లగేజీని తీసుకుని కారును వదిలి పారిపోయారు.

అసలు ఈ కారు దొంగతనం ఎలా జరిగింది అనే విషయానికి వస్తే.ప్రస్తుతం టామ్ ఇంగ్లండ్‌లోని బ‌ర్మింగ్ హామ్‌లో మిషన్ ఇంపాజిబుల్ ఏడో పార్ట్ షూటింగ్ లో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే తన బీఎండబ్ల్యూ కారును హోటల్ బయట పార్క్ చేశారు.ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న కొత్త కార్లకు తాళాలకు బదులుగా ఇగ్నీష‌న్ వ‌స్తుండ‌గా, దానికి ఉన్న వైర్లెస్ ట్రాన్స్మిటర్ ను ఉపయోగించి దొంగలు ఈ దొంగతనానికి పాల్పడ్డారు.

ఈ క్రమంలోనే దొంగలు కారు తీసుకు వెళ్తుండగా ఆ హీరో బాడీగార్డ్స్ సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు.

"""/"/ సమాచారం అందుకున్న పోలీసులు ట్రాకింగ్ సిస్టమ్ ఆధారంగా ఆ కారు ఎక్కడుందో గుర్తించారు.

దొంగలు ఆ కారు దొంగతనం చేసి స్మెత్ విక్ అనే గ్రామంలో వదిలి వెళ్లారు.

ఈ క్రమంలోనే పోలీసులు ట్రాకింగ్ సిస్టం ద్వారా ట్రేస్ చేసి కారును గుర్తించారు.

అయితే దొంగలు కారును ఏమీ చేయకుండా అప్పటికే అందులో ఉన్నటువంటి లగేజ్ కొంత డబ్బులను దొంగలు దోచుకెళ్లారని తెలుస్తోంది.

దొంగలు దోచుకెళ్లారు ఈ కారు బీఎండబ్ల్యూ 7 గా పేరుగాంచింది ఇది మన కరెన్సీలో అక్షరాల కోటి రూపాయలు ధర పలుకుతుంది.

టీపిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ?