ప్రస్తుతం పెళ్లిల సీజన్ కావడంతో ఎంతో మంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు.ఇప్పటికే వరుణ్ తేజ్ లావణ్య వివాహం జరగగా టాలీవుడ్ సీనియర్ నటుడు వెంకటేష్ కూడా తన కుమార్తెకు ఘనంగా నిశ్చితార్థం జరిపించారు.
ఇలా కోలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రెటీలు మరి కొద్ది రోజులలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే.తాజాగా దిల్ రాజు ( Dil Raju ) ఇంట కూడా పెళ్లి బాగాలు మోగబోతున్నాయని తెలుస్తోంది.
రౌడీ బాయ్స్( Rowday Boys ) అనే చిత్రం ద్వారా దిల్ రాజు సోదరుడు కుమారుడు ఆశిష్ రెడ్డి( Ashish Reddy ) హీరోగా తెలుగు పరిశ్రమకు పరిచయమైన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా ద్వారా పరవాలేదు అనిపించుకున్నటువంటి ఆశిష్ రెడ్డి తదుపరి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.అయితే ఈయన త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే గురువారం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈయన నిశ్చితార్థం( Engagement ) ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.
ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అద్వైత రెడ్డి( Advitha Reddy ) వేలికి ఉంగరం తొడిగి ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలా గురువారం నిశ్చితార్థం జరుపుకున్నటువంటి ఆశిష్ రెడ్డి వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తుంది.ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక ఆశిష్ నటించిన తదుపరి చిత్రం సెల్ఫిష్ ( Selfish ) ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.