సాధారణంగా సినిమా ఇండస్ట్రీ( Film Industry )లో అగ్రతారగా ఎదగాలంటే ఎక్స్‌పోజింగ్ చేయడం తప్పనిసరి అని చాలామంది అనుకుంటారు.కానీ చిట్టిపొట్టి బట్టలు వేసుకుని స్కిన్ షో చేయాల్సిన అవసరం లేకుండానే టాప్ హీరోయిన్లుగా ఎదగొచ్చని చాలామంది నిరూపించారు.
ఒక్క సినిమాలో కూడా వీరు గ్లామర్ షో చేయలేదు.బెడ్రూం సన్నివేశాల్లో సైతం నటించలేదు.
ఎలాంటి అశ్లీలత, అసభ్యకర సీన్లలో ఇప్పటి వరకూ యాక్ట్ చేసింది లేదు.కేవలం అందం, అభినయం, అద్భుతమైన నటన చాతుర్యంతో వారు స్టార్ హీరోయిన్లుగా ఎదిగారు.ఆ ముద్దుగుమ్మలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
• సాయి పల్లవి( Sai Pallavi )
ఫిదా సినిమా( Fidaa Movie )తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది సాయి పల్లవి.శ్యామ్ సింగ రాయ్, మిడిల్ క్లాస్ అబ్బాయి వంటి సినిమాలతో కూడా బాగా ఆకట్టుకుంది.అదిరిపోయే డ్యాన్సులు, ఆకట్టుకునే నటనతో ఈ తార టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
అంతేకాదు ఎలాంటి చెత్త పాత్రలు చేయకుండా మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి లాగా గుర్తింపు తెచ్చుకుంది.డబ్బు కోసం పాకులాడకుండా తనకి ఒక క్యారెక్టర్ ఉందంటూ ఆమె ఎప్పుడూ నిరూపిస్తూనే ఉంటుంది.అందుకే సాయి పల్లవి కి లేడీ పవర్ స్టార్( Lady Powerstar ) అనే పేరు వచ్చింది.
• కీర్తి సురేష్( Keerthy Suresh )
మహానటి సినిమాతో మహా క్రేజ్ తెచ్చుకున్న నటి కీర్తి సురేష్.నేను శైలజ, దసరా వంటి సినిమాలతోనూ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఏ మూవీలో కూడా ఈ ముద్దుగుమ్మ ఎక్స్‌పోజింగ్, వల్గారిటీ సీన్స్ చేయలేదు.కేవలం గొప్ప నటన నైపుణ్యంతోనే ఆమె అగ్ర హీరోయిన్ స్థాయికి చేరుకుంది.
• నివేదా థామస్( Nivetha Thomas )
నిన్ను కోరి, జై లవకుశ, బ్రోచేవారెవరురా, వకీల్ సాబ్( Vakeel Saab ) వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది నివేథా థామస్.ఈ చెన్నై భామ కూడా తను నటించిన ఏ సినిమాలోనూ స్కిన్ షో( Skin Show ) చేయలేదు.తన ముచ్చటైన హావభావాలతోనే చాలామంది ప్రేక్షకుల హృదయాలను దోచేసింది.
• అనుష్క శెట్టి( Anushka Shetty )
అనుష్క శెట్టి అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది.తనకు పేరు తెచ్చి పెట్టిన ఏ సినిమాలోనూ స్కిన్ షో చేయలేదు.ఇటీవల మిస్ షెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో కూడా ఈ తార చాలా పద్ధతిగా కనిపించింది.ఆమె మూవీలో చేసిన యాక్టింగ్ వేరే లెవల్ అని చెప్పుకోవచ్చు.
ఆమె కారణంగానే ఈ సినిమా సూపర్ హిట్ అయింది.ఈ అందాల తార సైజ్ జీరో( Size Zero ) వంటి ప్రయోగాత్మక సినిమాలు కూడా చేస్తుంది.