ఏపీలో ఎన్నికలు( AP Elections ) దగ్గరపడే కొలది ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.టికెట్లు దక్కని చాలామంది నాయకులు ఇతర పార్టీలలో జాయిన్ అయిపోతున్నారు.
ఈ రకంగానే ఏలూరు టీడీపీ పార్లమెంట్ టికెట్( TDP Parliament Ticket ) ఆశించిన గోరుముచ్చు గోపాల్ యాదవ్ తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో జాయిన్ అయ్యారు.ఈ సందర్భంగా ఏలూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ యాదవ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం గోరుముచ్చు గోపాల్ యాదవ్( Gorumutchu Gopal Yadav ) మాట్లాడుతూ…రెండు రోజుల క్రితం సెల్ఫీ వీడియోలో బీసీలకు పార్లమెంట్ టికెట్ల విషయంలో వైయస్ జగన్( YS Jagan ) చేసిన మంచిని తెలియజేయడం జరిగింది.మొత్తం 25 పార్లమెంటు స్థానాలలో 12 బీసీ వర్గాలకు జగన్ గారు ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీ( Telugudesam Party )లో బీసీలకు గౌరవం లేదు.కనీసం నన్ను సంప్రదించకుండా టికెట్ ప్రకటించేశారు.
టికెట్ ప్రకటించిన నాలుగు రోజులు అవుతున్న గాని ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం పెద్దలు ఎవరు తనతో మాట్లాడలేదని గోరుముచ్చు గోపాల్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.టికెట్ రాకపోవడానికి ప్రధాన కారణం యనమల రామకృష్ణుడు.
ఇప్పుడు వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది.కచ్చితంగా ఎన్నికలలో ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా సునీల్ కుమార్ యాదవ్ ( YCP MP Sunik Kumar Yadav )కి మద్దతు తెలుపుతూ గెలిపించుకుంటామని అన్నారు.