టాలీవుడ్ కింగ్ నాగార్జున పుట్టిన రోజు నేడు.ఈ సందర్భం గా అక్కినేని అభిమానులు చాలా ఆశించారు, ఊహించారు.
కానీ నాగార్జున అభిమానులు తీవ్రంగా నిరుత్సాహం ని వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది.ఆయన నటించిన ఏ సినిమా యొక్క పోస్టర్లు కానీ వీడియో లు కానీ ప్రేక్షకుల ముందుకు రాలేదు.
కేవలం ఆయన అభిమానులు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్వీట్స్ చేయడం జరిగింది.అంతే తప్ప ఏ సినిమా అప్డేట్ కూడా ఆయన బర్త్డే సందర్భం గా రాలేదు.
ప్రస్తుతం నాగార్జున బ్రహ్మాస్త్ర మరియు ది ఘోస్ట్ సినిమా లో నటిస్తున్నాడు.వచ్చే వారంలో బ్రహ్మాస్త్ర సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసింది.
ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.అయితే ది ఘోస్ట్ సినిమా యొక్క అప్డేట్ ఏమైనా విడుదల చేసి ఉంటే బాగుండేది అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం సినిమా యొక్క ట్రైలర్ ని మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేయించిన విషయం తెలిసిందే.అయితే అదే ఇప్పుడు నాగార్జున బర్త్డే సందర్భంగా విడుదల చేసి ఉంటే అభిమానులు ఒకింత ఆనందం వ్యక్తం చేసే వారు అనేది ఇండస్ట్రీ వర్గాల వారి అభిప్రాయం.
నాగార్జున బర్త్డే కు ఎలాంటి హంగామా లేకపోవడం తో అభిమానులు మరియు ప్రేక్షకులు తీవ్రం గా నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.ఒకప్పుడు నాగార్జున బర్త్డే కి అభిమానుల సందడి అంగరంగ వైభవంగా ఉండేది.
కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా నీరు కారిపోయిందని ప్రేక్షకులు నిట్టూరుస్తున్నారు.అక్కినేని అభిమానులతో పాటు ప్రతి ఒక్కరి అభిమానుల అభిమానంను సొంతం చేసుకున్న నాగార్జునకు తెలుగు ప్రేక్షకులందరి తరపునే కాకుండా మా తరఫున కూడా హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు.
ఆయన ఎన్నో వందల సినిమా లు ముందు ముందు కూడా చేయాలని ,తీయాలని మేము కోరుకుంటున్నాం.హ్యాపీ బర్త్డే టాలీవుడ్ కింగ్ మన్మధుడ నాగార్జున.