టాలీవుడ్ లో హీరోలు వకీల్ సాబ్ లుగా నటించిన సినిమాలేంటో తెలుసా..?

టాలీవుడ్‍లో పలువురు హీరోలు తమ తమ సినిమాల్లో ఎన్నో పాత్రలు చేశారు.కొన్నింటిలో డాక్టర్లుగా నటిస్తే.

 Tollywood Heros Who Acted As Lawyer Roles , Ntr, Venkatesh, Chirenjeevi, Satyade-TeluguStop.com

మరికొన్నింటిలో పోలీసు పాత్రలు చేశారు.ఇంకొన్ని సినిమాల్లో టీచర్లుగా చేస్తే.

మరికొన్ని సినిమాల్లో లాయర్లుగా చేశారు.తాజాగా వకీల్ సాబ్ సినిమా చేసిన పవన్ కల్యాణ్ తన నటనతో అదరగొట్టాడు.

లాయర్ అంటే ఇలా ఉండాలి అని చూపించాడు.ఇప్పటి వరకు తెలుగు హీరోలు చాలా మంది లాయర్ పాత్రలు చేశారు.ఇంతకీ ఆ హీరోలు ఎవరు? వారు చేసిన సినిమాలు ఏంటి? అనేవి ఇప్పుడు తెలుసుకుందాం!

రాజేంద్ర ప్రసాద్‍:

Telugu Chirenjeevi, Gopichanand, Jr Ntr, Krishna, Nagarjuna, Rajendra Prasad, Sa

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‍ లాయర్‍ పాత్రలో మంచి వినోదాన్ని పంచాడు.చెట్టు కింద ప్లీడరు అనే సినిమా చేసిన ఆయన.ఇందులో ఆదాయం లేని లాయర్‍గా నటించాడు.

సందీప్‍ కిషన్‍:

Telugu Chirenjeevi, Gopichanand, Jr Ntr, Krishna, Nagarjuna, Rajendra Prasad, Sa

టాలీవుడ్ యంగ్‍ హీరో సందీప్‍ కిషన్‍ కూడా లాయర్‍ పాత్ర చేశాడు.తెలివైన కుర్ర లాయర్‍ రాజకీయ నాయకురాలిని జైల్లో వేసేలా చేస్తాడు.తెనాలి రామకృష్ణ సినిమాలో సందీప్ మంచి లాయర్‍గా ప్రేక్షకులను మెప్పించాడు.

జూనియర్‍ ఎన్టీఆర్‍:

Telugu Chirenjeevi, Gopichanand, Jr Ntr, Krishna, Nagarjuna, Rajendra Prasad, Sa

జూనియర్‍ ఎన్టీఆర్‍ తన తొలి సినిమాలోనే లాయర్‍గా ఆకట్టుకున్నాడు.న్యాయమూర్తి బిడ్డను కాపాడేందుకు తను కేసును టేకప్‍ చేసిన విధానం జనాల్లోకి బాగా వెళ్లింది.

నాగార్జున:

Telugu Chirenjeevi, Gopichanand, Jr Ntr, Krishna, Nagarjuna, Rajendra Prasad, Sa

అక్కినేని నాగార్జున సైతం లాయర్‍ పాత్ర చేశాడు.అధిపతి మూవీలో లాయర్ పాత్ర లో స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తాడు.

శ్రీకాంత్:

Telugu Chirenjeevi, Gopichanand, Jr Ntr, Krishna, Nagarjuna, Rajendra Prasad, Sa

శ్రీకాంత్‍ కూడా లాయర్‍ గెటప్ వేశాడు.రాధా గోపాళం సినిమాలో లాయర్‍ పాత్రలో మెప్పించాడు.

కృష్ణ:

Telugu Chirenjeevi, Gopichanand, Jr Ntr, Krishna, Nagarjuna, Rajendra Prasad, Sa

సూపర్‍ స్టార్‍ కృష్ణ కూడా లాయర్‍ అవతారం ఎత్తాడు.గూండా రాజ్యం అనే సినిమాలో లాయర్‍ గెటప్‍ వేశాడు.

చిరంజీవి:

Telugu Chirenjeevi, Gopichanand, Jr Ntr, Krishna, Nagarjuna, Rajendra Prasad, Sa

మెగాస్టార్ చిరంజీవి సైతం లాయర్‍గా తన వాదనలు వినిపించాడు.అభిలాష సినిమాలో తన వాక్చాతుర్యంతో కేసు గెలిచే విధానం ఆకట్టుకుంటుంది.

గోపించంద్‍:

Telugu Chirenjeevi, Gopichanand, Jr Ntr, Krishna, Nagarjuna, Rajendra Prasad, Sa

మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్‍ సినిమాలో గోపీచంద్‍ లాయర్‍ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

వెంకటేశ్:

Telugu Chirenjeevi, Gopichanand, Jr Ntr, Krishna, Nagarjuna, Rajendra Prasad, Sa

ధర్మచక్రం సినిమాలో వెంకటేష్ లాయర్‍ పాత్ర పోషించి న్యాయాన్ని గెలిపిస్తాడు.

ఎన్టీఆర్‍:

Telugu Chirenjeevi, Gopichanand, Jr Ntr, Krishna, Nagarjuna, Rajendra Prasad, Sa

లాయర్‍ విశ్వనాథ్ సినిమాలో నందమూరి తారక రామారావు లాయర్‍ పాత్ర పోషించాడు.ఈ సినిమాతో పాటు ఇంకొన్ని సినిమాల్లోనూ ఆయన లాయర్‍ పాత్రలు చేశాడు.

ఏఎన్నార్:

Telugu Chirenjeevi, Gopichanand, Jr Ntr, Krishna, Nagarjuna, Rajendra Prasad, Sa

అక్కినేని నాగేశ్వర్‍ రావు సైతం పలు సినిమాల్లో లాయర్‍ పాత్రలు చేశాడు.సుడిగుండాలు, ఆదర్శవంతుడుతో పాటు మరికొన్ని సినిమాల్లో వకీలుగా కనిపించాడు.

పవన్‍ కల్యాణ్:

Telugu Chirenjeevi, Gopichanand, Jr Ntr, Krishna, Nagarjuna, Rajendra Prasad, Sa

పవన్‍ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో లాయర్‍ పాత్ర వేశాడు.తన అద్భుత నటనతో సినిమా మంచి విజయం సాధించింది.

సత్యదేవ్‍:

Telugu Chirenjeevi, Gopichanand, Jr Ntr, Krishna, Nagarjuna, Rajendra Prasad, Sa

కన్నడలో విడుదల అయిన బీర్బల్‍ సినిమా తెలుగులో తిమ్మరుసుగా రాబోతుంది.ఈ సినిమాలో సత్యదేవ్ లాయర్‍గా కనిపించనున్నాడు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube