మంచు వారసుడిగా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో మనోజ్ (Manoj) ఒకరు.అయితే ఈయన తన వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి మనోజ్ అనంతరం రెండో పెళ్లి చేసుకున్నారు.
ఇక రెండో పెళ్లి తర్వాత మనోజ్ తన కెరియర్ పట్ల కూడా బిజీ అవుతున్నారని చెప్పాలి.ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఈయన ఉస్తాద్ (Ustaad) అనే షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ కార్యక్రమం డిసెంబర్ 15వ తేదీ నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయనకు రాజకీయాల గురించి పలు ఆసక్తికరమైనటువంటి ప్రశ్నలు ఎదురయ్యాయి.గత ఎన్నికలలో మంచు ఫ్యామిలీ మొత్తం వైఎస్ఆర్సిపి పార్టీకి సపోర్ట్ చేశారు అయితే ఈసారి కూడా ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఈయనని విలేకరులు ప్రశ్నిస్తూ గత ఎన్నికలలో వైఎస్ఆర్సిపి ( YSRCP) పార్టీకి మద్దతు తెలియజేశారు.ఈసారి ఎవరికి మద్దతు తెలియజేయబోతున్నారు అంటూ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు మనోజ్ సమాధానం చెబుతూ నేను గత ఎన్నికలలో ఎవరికి మద్దతు తెలియజేయలేదు నేను మా నాన్నకు మాత్రమే మద్దతు తెలియజేశాను అంటూ ఈ సందర్భంగా మనోజ్ సమాచారం చెప్పారు.మరి ఈసారి మీరు మీ నాన్న వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు తెలియజేస్తారా లేక మీ భార్య టిడిపి(TDP ) పార్టీ కనుక టిడిపి పార్టీకి మద్దతు తెలియజేస్తారా అనే ప్రశ్న ఎదురయింది.ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ నేను ఎప్పుడూ కూడా పలానా పార్టీకి ఓటు వేయమని ఎవరికీ చెప్పలేదు నా ఫ్రెండ్స్ ఎవరైనా స్టాండ్ తీసుకుంటే మాత్రం వారికి నేను ఓటు వేస్తాననీ తెలిపారు.
కానీ ఇప్పుడు మాత్రం నాన్న వైసిపి భార్య టీడీపీ కదా మరి మీ సపోర్ట్ ఎవరికి అని మరోసారి కూడా అదే ప్రశ్న వేయడంతో ఈయన మాత్రం నేను తన భార్య స్టాండ్ తీసుకుని విన్ అవుతాను అంటే తనకే సపోర్ట్ చేస్తానని నా ప్రియారిటి తనే అంటూ ఈ సందర్భంగా మౌనిక రెడ్డి (Mounika) గురించి మనోజ్ మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.మనోజ్ భార్య మౌనిక రెడ్డి ప్రముఖ రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కుమార్తె అనే విషయం మనకు తెలిసిందే ఒకప్పుడు భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు అయితే వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత వీరు వైయస్ జగన్ వెంట నడిచారు.అయితే గత ఎన్నికలలో వైఎస్ జగన్ ఓడిపోవడంతో భూమా నాగిరెడ్డి అలాగే తన పెద్ద కుమార్తె అఖిల ప్రియ ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన అఖిల మంత్రిగా కొనసాగారు.అయితే ఇప్పటికే భూమ ఫ్యామిలీ టిడిపి పార్టీకే మద్దతు తెలియజేస్తున్నారు.