తెలుగులో తొలిసారి రూ. 100 కోట్లు సాధించిన సినిమా ఏంటో తెలుసా?

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ రేంజ్ బాగా పెరిగింది.బాలీవుడ్ కు ఏమాత్రం తీసిపోని రీతిలో సినిమాలు తెరకెక్కుతున్నాయి.

 Tollywood First 100 Crore Movie Magadheera. Tollywood Movie, Magadherrea, Rajam-TeluguStop.com

టెక్నికల్ వ్యాల్యూస్ విషయంలో గానీ, బడ్జెట్ విషయంలో గానీ దర్శక నిర్మాతలు ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు.అందుకే ప్రస్తుత సినిమాలు వంద కోట్ల రూపాయల మార్కును ఈజీగా దాటుతున్నాయి.

ఒకప్పుడు 50 కోట్ల రూపాయల వసూళ్లు సాధించేందుకే నానా ఇబ్బందులు పడ్డ సినిమాలు ప్రస్తుతం 100 కోట్లను ఈజీగా కొల్లగొడుతున్నాయి.తాజాగా బాహుబలి దెబ్బకు పాత రికార్డులన్నీ బద్దలయ్యాయి.

ఈ సినిమా రికార్డులను ఇప్పట్లో మరే సినిమా బీట్ చేసే స్థితిలో కూడా మరే సినిమా లేదనే చెప్పుకోవచ్చు.అయితే తెలుగులో తొలిసారి 100 కోట్లు సాధించిన సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రాంచరణ్ హీరోగా చేసిన రెండో సినిమా మగధీర.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం నమోదు చేసింది.ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.వంద కోట్లు సాధించిన తొలి చిత్రంగా పేరు సంపాదించింది.

గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అర్జున్ ఈ సినిమాను నిర్మించాడు.ఇందులో అద్భుత నటనతో రామ్ చరణ్ అదరగొటాడు.

జులై 31, 2009లో విడుదల అయిన ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రను తిరగరాసింది.సినిమాలోని అన్ని సీన్లు జనాలకు విపరీతంగా నచ్చాయి.

Telugu Telugu, Kajal Aggarwa, Magadherrea, Rajamouli, Tollywood, Tollywoodcrore-

ప్రపంచ వ్యాప్తంగా మగధీర సినిమా 1200 థియేటర్లలో విడుదల అయ్యింది.223 సెంటర్లలో వంద రోజులు పూర్తి చేసుకుంది.అప్పటి వరకు ఇన్ని సెంటర్లలో ఏ సినిమా వంద రోజులు ఆడలేదు.39 కోట్ల బడ్జెట్ కి 125 కోట్ల గ్రాస్ వసూళు చేసింది ఈ సినిమా.వంద కోట్లు కలెక్ట్ చేసిన తొలి తెలుగు సినిమాగా నిలిచింది.అటు కర్నూల్ లోని ఓ సినిమా థియేటర్లో ఈ సినిమా 1000 రోజులు ఆడింది.మూవీగా మగధీర నిలిచింది.ఈ సినిమా రికార్డులే కాదు.

అవార్డులనూ కొల్లగొట్టింది. 9 నంది అవార్డులు, 2 నేషనల్ అవార్డులు, 7ఫిలిం ఫేర్ అవార్డులను దక్కించుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube