నిజమైన భార్యాభర్తల బంధం అంటే ఇదే.. వీడియో చూసినా నెటిజెన్స్ ప్రశంసల వర్షం..!

సోషల్ మీడియా( Social media )లో ప్రతిరోజు కొన్ని వేల కొత్త వీడియోలు ప్రత్యక్షం అవుతున్నాయి.ఇందులో కొన్ని వీడియోలను చూస్తే.

 This Is What A Real Husband And Wife Bond Is Husband , Wife, Viral Video, Lat-TeluguStop.com

ఆ వీడియోలో ఉండేవారిని ప్రశంసలంతో ముంచేత్తకుండా ఉండలేము.ఢిల్లీ ఉమెన్స్ కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మాలవీయ్( Swati malviya ) తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఓ జంటకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.

ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆ జంటపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఈ వీడియో చూస్తే భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధం అంటే ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో చాలా మందిని ఆకట్టుకోవడానికి కారణం ఏమిటంటే జొమాటో డెలివరీ ఏజెంట్ తన డ్యూటీ ముగిశాక, తన భార్య, పిల్లాడితో ఇంటికి వెళుతుంటాడు.అందులో జోమటో టీషర్టు( Zomato ) ధరించిన ఆ వ్యక్తి తన కుమారుని ఎత్తుకొని నడుస్తూ ఉంటే.అతని భార్య సైకిల్ హ్యాండిల్ పట్టుకొని నడుస్తూ ఉంటుంది.చూసే వారందరికీ కుటుంబం కోసం కష్టపడుతున్న భర్తకు తోడుగా సాయం అందిస్తున్న భార్య అనిపిస్తుంది.చూడడానికే ఈ వీడియో హృదయాలకు హత్తుకునేలా ఉంది.

ఈ వీడియోను కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే ఆమె భర్త సైకిల్ పై( Bicycle ) జొమాటో డెలివరీ చేసి తిరిగి వస్తుండగా.ఆర్య తమ పిల్లాడితో పనికి వెళ్లి తిరిగి వస్తూ మార్గమధ్యంలో ముగ్గురు కలిసి ఇంటికి వెళ్తున్నారని చూసే వారందరికీ అర్థమవుతుంది.స్వాతి మాలవీయ్ షేర్ చేసిన ఈ పోస్టు కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే 56,000 మంది వీక్షించారు.19 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.ఈ వీడియో చూసిన వారంతా భార్యాభర్తల మధ్య ఇలాంటి అనుబంధాలు ఉంటే ఎప్పటికీ విడిపోరని.

చూడడానికి ఈ జంట ఎంతో చూడముచ్చటగా ఉందని.సమాజంలో ఉండే వారందరూ ఇలాంటి జంటలను ఆదర్శంగా తీసుకోవాలి అని ఆ జంటను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube