అవును, మీరు ఇక్కడ విన్నది నిజమే.ఈ ఫీట్ మరెవ్వరి వల్లా కాదు.72ఏళ్లకి డిగ్రీ పట్టా పొందడం అంటే సాధారణ విషయం కాదు.కానీ దాన్ని సుసాధ్యం చేసాడు ఓ వ్యక్తి.
చదువుకు వయోపరిమితి లేదని చేతల్లో నిరూపించాడు.మనం ఏ వయసులోనైనా జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు అని ఎలుగెత్తి చాటాడు.
వివరాల్లోకి వెళితే, జార్జియాలో నివసించే 72 ఏళ్ల వృద్ధుడు ‘సామ్ కప్లాన్( Sam Kaplan )’ విద్యకు ఏ వయసు అడ్డంకి కాదని తాజాగా నిరూపించారు.జీవితంలో అలసిసొలసి రెస్టు తీసుకోవలసిన వృద్ధ వయస్సులో అతను పట్టభద్రులయ్యారు.
కాగా, సామ్ గ్రాడ్యుయేషన్ వేడుకకి అతని 98 ఏళ్ల తల్లి కూడా హాజరు కావడం విశేషం.ఈ ప్రత్యేక సందర్భంలో ఇద్దరూ చాలా ఎమోషనల్ కావడం ఇక్కడ వైరల్ అవుతున్న పోస్టులో చూడవచ్చు.అవును, ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ పోస్ట్‌పై నెటిజన్లు పెద్ద స్థాయిలో స్పందించారు.సామ్ కప్లాన్ జార్జియా( Georgia )లోని లారెన్స్‌విల్లేలో నివసిస్తున్నారు.అతను గ్విన్నెట్ కళాశాల( Gwinnett College ) నుండి సినిమా, మీడియా ఆర్ట్స్‌లో పట్టభద్రుడయ్యాడు.
దాంతో గురువారం ఆయన కాలేజీలో కాన్వొకేషన్ కార్యక్రమం ముగిసింది.తన తల్లితో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, సామ్ మాట్లాడుతూ, “నేను నా మాధ్యమిక విద్యను 1969లో పూర్తి చేయడం జరిగింది.ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల తరువాత నా చదువు ఆగిపోయింది.డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రేడియోలో ఒక వార్త విన్నాను.అందులో ఓ కాలేజీ ప్రస్తావన రాగా ఆ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడానికి వయోపరిమితి లేదని చెప్పడం జరిగింది.
ఈ క్రమంలోనే నేను 50 ఏళ్ల తర్వాత కూడా డిగ్రీ పొందవచ్చని తెలుసుకున్నాను.దాంతో అప్పుడే గట్టిగా నిర్ణయించుకున్నాను.” అని చెప్పుకొచ్చారు.ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అతనిని తెగ మెచ్చుకుంటున్నారు.