ఇది మరెవ్వరికీ సాధ్యం కాదు… 72ఏళ్లకి డిగ్రీ పట్టా పొందిన వృద్ధుడు!

అవును, మీరు ఇక్కడ విన్నది నిజమే.ఈ ఫీట్ మరెవ్వరి వల్లా కాదు.

72ఏళ్లకి డిగ్రీ పట్టా పొందడం అంటే సాధారణ విషయం కాదు.కానీ దాన్ని సుసాధ్యం చేసాడు ఓ వ్యక్తి.

చదువుకు వయోపరిమితి లేదని చేతల్లో నిరూపించాడు.మనం ఏ వయసులోనైనా జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు అని ఎలుగెత్తి చాటాడు.

వివరాల్లోకి వెళితే, జార్జియాలో నివసించే 72 ఏళ్ల వృద్ధుడు 'సామ్ కప్లాన్( Sam Kaplan )' విద్యకు ఏ వయసు అడ్డంకి కాదని తాజాగా నిరూపించారు.

జీవితంలో అలసిసొలసి రెస్టు తీసుకోవలసిన వృద్ధ వయస్సులో అతను పట్టభద్రులయ్యారు. """/" / కాగా, సామ్ గ్రాడ్యుయేషన్ వేడుకకి అతని 98 ఏళ్ల తల్లి కూడా హాజరు కావడం విశేషం.

ఈ ప్రత్యేక సందర్భంలో ఇద్దరూ చాలా ఎమోషనల్ కావడం ఇక్కడ వైరల్ అవుతున్న పోస్టులో చూడవచ్చు.

అవును, ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ పోస్ట్‌పై నెటిజన్లు పెద్ద స్థాయిలో స్పందించారు.

సామ్ కప్లాన్ జార్జియా( Georgia )లోని లారెన్స్‌విల్లేలో నివసిస్తున్నారు.అతను గ్విన్నెట్ కళాశాల( Gwinnett College ) నుండి సినిమా, మీడియా ఆర్ట్స్‌లో పట్టభద్రుడయ్యాడు.

దాంతో గురువారం ఆయన కాలేజీలో కాన్వొకేషన్ కార్యక్రమం ముగిసింది.తన తల్లితో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

"""/" / ఈ నేపథ్యంలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, సామ్ మాట్లాడుతూ, "నేను నా మాధ్యమిక విద్యను 1969లో పూర్తి చేయడం జరిగింది.

ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల తరువాత నా చదువు ఆగిపోయింది.డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రేడియోలో ఒక వార్త విన్నాను.

అందులో ఓ కాలేజీ ప్రస్తావన రాగా ఆ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడానికి వయోపరిమితి లేదని చెప్పడం జరిగింది.

ఈ క్రమంలోనే నేను 50 ఏళ్ల తర్వాత కూడా డిగ్రీ పొందవచ్చని తెలుసుకున్నాను.

దాంతో అప్పుడే గట్టిగా నిర్ణయించుకున్నాను." అని చెప్పుకొచ్చారు.

ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అతనిని తెగ మెచ్చుకుంటున్నారు.

మహేష్ బాబు సినిమా కోసం భారీ డిసీజన్స్ తీసుకుంటున్న రాజమౌళి…